తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. కేసీఆర్‌, పార్టీ నేతల శుభాకాంక్షలు | Ex CM KCR And BRS Leaders Telangana Formation Day Wishes | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. కేసీఆర్‌, పార్టీ నేతల శుభాకాంక్షలు

Jun 2 2025 9:10 AM | Updated on Jun 2 2025 10:11 AM

Ex CM KCR And BRS Leaders Telangana Formation Day Wishes

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపాం. అదే స్పూర్తిని కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగించాలని కోరుకుంటున్నట్టు వ్యాఖ్యానించారాయన.

 

మరోవైపు బీఆర్‌ఎస్‌ కీలక నేతలు సైతం శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. హరీష్‌రావు ట్విట్టర్‌ వేదికగా.. దశాబ్దాల కాలపు కొట్లాటకు, నాలుగు కోట్ల ప్రజల తండ్లాటకు విముక్తి లభించిన రోజు నేడు. సుదీర్ఘ స్వప్నం.. సాకారమైన సుదినం నేడు. ‘తెలంగాణ వచ్చుడో ..కేసీఆర్‌ సచ్చుడో.. కేసీఆర్‌ శవయాత్రో..తెలంగాణ జైత్రయాత్రో’ అంటూ నినదించిన కేసీఆర్ గారు గమ్యాన్ని ముద్దాడే వరకు విశ్రమించలేదు. 

.. సబ్బండ వర్గాలు ఏకమై గర్జించి, ఆత్మగౌరవం కోసం సాగిన పోరాట ఫలితం తెలంగాణ. స్వరాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలు మరువ లేనివి. వారికి జోహార్లు. రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. జై తెలంగాణ’ అంటూ వ్యాఖ్యలు చేశారు. 

 

 

Advertisement
 
Advertisement
Advertisement