
Photo Courtesy: BCCI/IPL
ఐపీఎల్-2025లో ఆదివారం(మే 18) రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ అనంతరం రాజస్తాన్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీని బాలీవుడ్ నటి, పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా హగ్ చేసుకున్నట్లు ఫోటోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టాయి.
అంతేకాకుండా 14 ఏళ్ల చిన్నారికి హాగ్ ఇవ్వడం ఏంటని కొన్ని వెబ్ సైట్లు కూడా కథనాలు ప్రచరించాయి. తాజాగా ఇదే విషయంపై ప్రీతి జింటా స్పందించారు. ఈ ఫోటోలు పూర్తిగా ఫేక్ అని, వార్తా ఛానెళ్లు కూడా ఇలాంటి తప్పుడు చిత్రాలను ప్రసారం చేయడమేంటని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.
"ఇది మార్ఫింగ్ చేసిన ఫోటో. తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఆఖరి న్యూస్ ఛానెల్స్ కూడా మార్ఫింగ్ చేసిన చిత్రాలను ఉపయోగించి వాటిని వార్తలుగా చూపిస్తున్నాయి. అది చూసి నేను ఆశ్చర్యపోయాను" అని ఎక్స్‌లో ఆమె రాసుకొచ్చింది.
కాగా అసలు వీడియోలో మాత్రం ప్రీతి జింటా వైభవ్‌తో కరచాలనం చేసి, కాసేపు మాట్లాడినట్లు ఉంది. కొంతమంది ఏఐ సాయంతో ప్రీతీ.. వైభవ్ ను కౌగిలించుకుంటున్నట్టు ఫొటోలను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారాయి. ఇక ఇది ఇలా ఉండగా.. వరుస విజయాలతో పంజాబ్ కింగ్స్ ఇప్పటికే తమ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది.
చదవండి: IPL 2025: ప్లే ఆఫ్స్‌కు ముందు ఆర్సీబీకి గుడ్ న్యూస్