
Photo Courtesy: BCCI/IPL
ఐపీఎల్-2025 ప్లే ఆఫ్స్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు భారీ ఊరట లభించింది. భుజం గాయంతో బాధపడుతున్న ఆ జట్టు స్టార్ పేసర్, ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ తిరిగి తన ప్రాక్టీస్‌ను మొదలు పెట్టాడు.
ఈ ఏడాది సీజన్‌లో ఏప్రిల్ 27న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాజిల్‌వుడ్ గాయపడ్డాడు. దీంతో మే 3న సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌కు ఈ ఆసీస్ స్పీడ్ స్టార్ దూరమయ్యాడు. అంతలోనే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ వారం రోజుల పాటు వాయిదా పడడంతో హాజిల్‌వుడ్ తన స్వదేశానికి వెళ్లిపోయాడు.
అతడు ప్రస్తుతం ఆస్ట్రేలియాలోనే ఉన్నాడు. ఈ క్రమంలో హాజిల్‌వుడ్ తిరిగి భారత్‌కు వస్తాడా? లేదా అన్న సందేహాలు అందరిలో నెలకొన్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు అతడిని భారత్‌కు పంపించి క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకోదని వార్తలు వచ్చాయి.
కానీ ఇప్పుడు హాజిల్‌వుడ్ తిరిగి ప్రాక్టీస్ మొదలు పెట్టడంతో త్వరలోనే భారత్‌కు చేరుకునే అవకాశముంది. మే 29 నుంచి ప్రారంభమయ్యే ప్లేఆఫ్‌లకు హాజిల్‌వుడ్ తిరిగి వస్తాడని ఆర్సీబీ వర్గాలు ధ్రువీకరించాయి. ఈ ఏడాది సీజన్‌లో జోష్ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు.
ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన హాజిల్‌వుడ్ 18 వికెట్లు పడగొట్టి ఆర్సీబీ తరపున లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. కాగా ఆర్సీబీ ఇంకా రెండు లీగ్ మ్యాచ్‌లు మిగిలూండగానే ఫ్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధించింది. బెంగళూరు జట్టు తమ తదుపరి మ్యాచ్‌లో మే 23న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది.
Josh Hazlewood started bowling. We're coming for that tinpot trophy 😭🔥😭🔥😭🔥😭 pic.twitter.com/oxSFVVjxwL
— M0 B0BAT 🧠 (@rohancric947) May 20, 2025