సాక్షి, ఆదిలాబాద్: యువతులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ‘హిమాలయ వెల్‌నెస్’ ముందడుగు వేసింది. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘1డెర్‌వుమన్ అకాడమీ’ని ప్రారంభించింది. ఈ అకాడమీ ద్వారా యువ మహిళా క్రికెట్ ఆశావహులను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మహిళా జట్టు ఆటగాళ్లతో మాట్లాడే అవకాశం కల్పిస్తోంది. వంద మందికి స్కాలర్‌షిప్‌లను కూడా అందించనుంది.
క్రికెట్‌కు సంబంధించిన విలువైన సూచనలు, మార్గనిర్దేశం ఒక ఇంటరాక్టివ్ చాట్‌బాట్ రూపంలో అందిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా అకాడమీ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్స్ అందించనున్నారు. తుది అసైన్‌మెంట్‌నే స్కాలర్‌షిప్ దరఖాస్తుగా పరిగణించనున్నారు. ఇలాంటి డిజిటల్ వేదికకే పరిమితం కాకుండా ఫీమేల్ క్రికెట్ అకాడమీతో కలిసి ఒక ప్రత్యేక క్రికెట్ టోర్నమెంట్ కూడా నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు.
ఈ టోర్నమెంట్‌కు 200కు పైగా దరఖాస్తులు వచ్చాయన్నారు. అందులో 25 మంది యువ బాలికలు ఆర్సీబీ జట్టును ప్రత్యక్షంగా కలిసే అవకాశం పొందారన్నారు. మహిళా క్రికెట్ దేశవ్యాప్తంగా ఆదరణ పొందుతున్న ఈ సమయంలో 1డెర్‌వుమన్ అకాడమీ యువ బాలికలు చరిత్రను కేవలం చూడటానికే కాకుండా, ఆ చరిత్రలో భాగస్వాములయ్యే అవకాశం కల్పిస్తోందని పేర్కొన్నారు.


