RCB: అతడికి తుదిజట్టులో చోటు ఉండదు.. కానీ! | RCB Picks Venkatesh Iyer After Disappointing KKR Season, Anil Kumble Analyzes His Role And Challenges Ahead In IPL 2026 | Sakshi
Sakshi News home page

IPL 2026: రూ. 7 కోట్లు.. తుదిజట్టులో చోటు ఉండదు.. కానీ!

Mar 13 2026 4:00 PM | Updated on Mar 13 2026 4:34 PM

Any moment you want to bring Him: Anil Kumble on RCB playing 11 IPL 2026

ఆర్సీబీ జట్టు (PC: BCCI)

ఐపీఎల్‌-2025 మెగా వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లలో వెంకటేశ్‌ అయ్యర్‌ ఒకడు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ అతడి కోసం ఏకంగా రూ. 23.75 కోట్లు ఖర్చు చేసింది. కానీ ఈ ఆల్‌రౌండర్‌ అందుకు తగ్గ ప్రదర్శన ఇవ్వడంలో విఫలమయ్యాడు.

గతేడాది ఐపీఎల్‌లో వెంకటేశ్‌ అయ్యర్‌ పదకొండు మ్యాచ్‌లు ఆడి కేవలం 142 పరుగులే చేశాడు. ఇక బౌలింగ్‌ విభాగంలో సేవలు అందించనేలేదు. దీంతో ఐపీఎల్‌-2026 వేలానికి ముందు కేకేఆర్‌ అతడిని వదిలేసింది.

రూ. 7 కోట్లకు కొనుగోలు
ఈ క్రమంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు వెంకటేశ్‌ అయ్యర్‌ను రూ. 7 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే వెంకటేశ్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లలో అతడికి తుదిజట్టులో చోటు దక్కే అవకాశం లేదన్నాడు.

తుదిజట్టులో స్థానం దక్కకపోవచ్చు
ఈ మేరకు స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో మాట్లాడుతూ.. ‘‘గతేడాది ఆడించిన తుదిజట్టుతోనే ఆర్సీబీ కొనసాగుతుందని అనిపిస్తోంది. కాబట్టి వెంకటేశ్‌ అయ్యర్‌కు తుదిజట్టులో స్థానం దక్కకపోవచ్చు. ముఖ్యంగా ఆరంభ మ్యాచ్‌లలో అతడి అవసరం ఉండదనే అనిపిస్తోంది.

దేవదత్‌ పడిక్కల్‌ కచ్చితంగా ప్లేయింగ్‌ ఎలెవన్‌లో ఉంటాడు. గాయం వల్ల గతంలో రెండు మ్యాచ్‌లు మిస్సయ్యాడు. అయితే, ఇప్పుడు అతడు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కాబట్టి ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా దేవదత్‌ పడిక్కల్‌ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక బౌలింగ్‌ ఆప్షన్‌గా సూయశ్‌ శర్మ ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా ఉండనే ఉంటాడు.

లెఫ్టాండర్‌ కావడం వల్ల 
ఏదేమైనా వెంకటేశ్‌ అయ్యర్‌ కూడా అద్భుతమైన ఆటగాడే. అతడు జట్టుతో ఉండటం అదనపు బలం. ఏ క్షణంలోనైనా.. ఏ పరిస్థితుల్లోనైనా అతడు అందుబాటులో ఉంటాడు. అతడి అనుభవం జట్టుకు మేలు చేస్తుంది. 

ముఖ్యంగా అతడు లెఫ్టాండర్‌ కావడం వల్ల పడిక్కల్‌కు సరైన బ్యాకప్‌ ఆప్షన్‌గా పనిచేస్తాడు’’ అని కుంబ్లే పేర్కొన్నాడు. కాగా గతేడాది ఆర్సీబీ టైటిల్‌ గెలిచిన సంగతి తెలిసిందే. పద్దెమినిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రజత్‌ పాటిదార్‌ సారథ్యంలో ఆర్సీబీ తొలిసారి ట్రోఫీని ముద్దాడింది.

ఐపీఎల్‌-2026 ఆర్సీబీ జట్టు
రజత్ పాటిదార్ (కెప్టెన్‌), విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, ఫిల్ సాల్ట్, జితేశ్‌ శర్మ, కృనాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, జేకబ్‌ బెతెల్‌, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్, భువనేశ్వర్ కుమార్, నువాన్ తుషార, రసిఖ్ సలామ్‌, అభినందన్ సింగ్‌, సూయశ్‌ శర్మ, వెంకటేశ్‌ అయ్యర్‌, మంగేశ్‌ యాదవ్‌, జేకబ్‌ డఫీ, సాత్విక్‌ ఒస్త్వాల్‌, జోర్డాన్‌ కాక్స్‌, విహాన్‌ మల్హోత్రా, కనిష్క్‌ చౌహాన్‌, విక్కీ ఒస్త్వాల్‌.

చదవండి: T20 WC: రాస్కెల్స్‌.. నిప్పుతో చెలగాటం: ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ ప్రశంసలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement