ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. ఆస్తి వివాదాల పరిష్కారం | Rasi Phalalu: Daily Horoscope On 02-06-2025 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. ఆస్తి వివాదాల పరిష్కారం

Jun 2 2025 5:44 AM | Updated on Jun 2 2025 9:24 AM

Rasi Phalalu: Daily Horoscope On 02-06-2025 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి: శు.సప్తమి రా.12.06 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: మఖ రా.2.31 వరకు, తదుపరి పుబ్బ, వర్జ్యం: ప.2.06 నుండి 3.45 వరకు, దుర్ముహూర్తం: ప.12.26 నుండి 1.18 వరకు, తదుపరి ప.3.03 నుండి 3.55 వరకు, అమృతఘడియలు: రా.12.07 నుండి 1.46 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 5.28, సూర్యాస్తమయం: 6.27. 

మేషం.... వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

వృషభం.... కొన్ని కార్యక్రమాలు వాయిదా పడతాయి. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

మిథునం..... పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కర్కాటకం.... ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. మిత్రులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

సింహం.. కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాహయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

కన్య....... వ్యవహారాలలో అవరోధాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశపరుస్తాయి.

తుల..... దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. కార్యజయం. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

వృశ్చికం.. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి.

ధనుస్సు.. వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. మిత్రులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

మకరం.... కుటుంబసమస్యలు. కార్యక్రమాలలో అవరోధాలు. ఆరోగ్యం మందగిస్తుంది. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

కుంభం.. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తిలాభం. శ్రమ ఫలిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

మీనం.... శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. కొత్త పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement