
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో సోమవారం ఎకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. తాత్కాలిక కెప్టెన్ జితేష్ శర్మ తుపాన్ ఇన్నింగ్స్‌తో ఆర్సీబీ టాప్-2 ప్లేస్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో హైడ్రామా చోటు చేసుకుంది. లక్నో యువ స్పిన్నర్ దిగ్వేష్ సింగ్ రాఠి మరోసారి తన చర్యతో వార్తల్లోకెక్కాడు.
అసలేమి జరిగిందంటే?
228 పరుగుల భారీ లక్ష్య చేధనలో విరాట్ కోహ్లి(54) ఔటయ్యాక స్టాండ్ ఇన్ కెప్టెన్ జితేష్ శర్మ క్రీజులోకి వచ్చాడు. జితేష్ తన ఎదుర్కొన్న తొలి బంతి నుంచే బౌండరీలు బదడం మొదలుపెట్టాడు. జితేష్ క్రీజులోకి వచ్చినప్పటికే ఆర్సీబీ కావల్సిన రన్ రేట్ ఓవర్‌కు 13పైగా ఉంది. దీంతో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. బౌలర్లను ఎంతమంది మార్చిన అతడిని ఆపడం ఎవరి తరం కాలేదు.
ఈ క్రమంలో అతడి దూకుడును అడ్డుకట్ట వేసేందుకు స్పిన్నర్ దిగ్వేష్‌ను తిరిగి పంత్ ఎటాక్‌లోకి తెచ్చాడు. దీంతో 17 ఓవర్ వేసిన దిగ్వేష్ ఓవరాక్షన్ చేశాడు. జితేష్‌ను తన బౌలింగ్‌తో ఆపలేకపోయిన దిగ్వేష్.. అతడిని మన్కడింగ్ చేసి పెవిలియన్‌కు పంపాలని ప్రయత్నించాడు.
ఆ ఓవర్ ఆఖరి బంతిని వేసే క్రమంలో నాన్ స్ట్రైక్‌లో ఉన్న జితేష్ క్రీజు దాటడం గమనించిన దిగ్వేష్ బంతిని డెలివరీ చేయకుండా స్టంప్స్‌ను పడగొట్టాడు. వెంటనే రనౌట్‌కు అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్‌లు థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు. పలు మార్లు రిప్లేలు పరిశీలించిన థర్డ్ అంపైర్.. అప్పటికే దిగ్వేశ్ బౌలింగ్ యాక్షన్ పూర్తి చేయడంతో నిబంధనల ప్రకారం నాటౌట్‌గా ప్రకటించాడు.
పంత్ క్రీడా స్పూర్తి..
అయితే ఇదే సమయంలో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ క్రీడా స్పూర్తిని ప్రదర్శించాడు. థర్డ్ అంపైర్ తన నిర్ణయం ప్రకటించికముందే పంత్ తమ అప్పీల్‌ను వెనక్కి తీసుకున్నాడు. దీంతో జితేత్.. పంత్‌కు వద్దకు వెళ్లి అలిగంనం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కోహ్లి ఫైర్..
కాగా దిగ్వేష్ మన్కడింగ్‌కు ప్రయత్నించడంతో డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్ప విరాట్ కోహ్లి ఊగిపోయాడు. తన చేతిలో ఉన్న బాటిల్‌ను కిందకు విసిరి కొట్టాడు. అస్సలు నీవు ఏమి చేస్తున్నావు అన్నట్లు కోహ్లి సీరియస్ రియాక్షన్ ఇచ్చాడు. కాగా దిగ్వేష్ ఇప్పటికే తన మితిమీరిన ప్రవర్తనతో ఓ మ్యాచ్ నిషేదాన్ని కూడా ఎదుర్కొన్నాడు.
థర్డ్ అంపైర్ ఎందుకు నాటౌట్ ఇచ్చాడంటే?
మెరిల్‌బోన్ క్రికెట్ నిబంధనల ప్రకారం.. బౌలర్ నాన్ స్ట్రైకర్ బ్యాటర్ ను రనౌట్ చేయాలనుకుంటే యాక్షన్‌ను పూర్తి చేయకముందే ఔట్ చేయాలి. అంటే చేతిని పూర్తిగా తిప్పకముందే వికెట్లను గిరాటు వేయాలి. కానీ దిగ్వేష్ మాత్రం తన బౌలింగ్ యాక్షన్‌ను పూర్తి చేసి స్టంప్స్‌ను పడగొట్టాడు. దీంతో థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు.
Watch out for Virat’s reaction after Digvesh attempted mankid on Jitesh Sharma. #IPL2025 #IPL #JiteshSharma pic.twitter.com/sAKf6Ck7TV
— Akhilesh Dhar (@akhileshdhar1) May 27, 2025