breaking news
Digvesh Singh Rathi
-
దిగ్వేష్ సింగ్ అద్భుతం.. ఐదు బంతుల్లో ఐదు వికెట్లు! వీడియో వైరల్
దిగ్వేష్ సింగ్ రాఠీ.. క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహించిన దిగ్వేష్.. ప్రదర్శనకంటే తన నోట్‌బుక్ సెలబ్రేషన్స్‌తో ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. ఎందుకంటే ఆ సెలబ్రేషన్స్‌కు గాను ఈ యువ స్పిన్నర్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.అద్బుతమైన టాలెంట్ ఉన్నప్పటికి శ్రుతిమించిన సెలబ్రేషన్స్ అతడి కొంపముంచాయి. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో అతడిపై బీసీసీఐ రెండు సార్లు జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం కూడా ఎదుర్కొన్నాడు. రాఠీ ఓవరాల్‌గా 13 మ్యాచ్‌లు ఆడి 14 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాము. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ అతడి అద్బుత బౌలింగ్ సంబంధించిన వీడియోను ఎక్స్‌లో షేర్ చేసింది. ఎంప్రెస్ క్రికెట్ లీగ్‌లో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి21న ఏబీ రైజింగ్ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో దిగ్వేష్... సహగల్ క్రికెట్ క్లబ్ తరపున వరుసగా ఐదు బంతుల్లో ఐదు వికెట్లు సాధించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను లక్నో ఫ్రాంచైజీ అభిమానులతో పంచుకుంది. ఆ మ్యాచ్‌లో దిగ్వేష్ మొత్తంగా 7 వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి జట్టు పతనాన్ని శాసించాడు. 264 పరుగుల భారీ లక్ష్య చేధనలో ఏబీ రైజింగ్ జట్టు 151 పరుగులకే కుప్పకూలింది.Digvesh Rathi. 5 stars 🌟 🌟🌟🌟🌟pic.twitter.com/tF4Nw0Gj0Q— Lucknow Super Giants (@LucknowIPL) June 16, 2025 -
IPL 2025: రేటు తక్కువ.. ప్రభావం చాలా ఎక్కువ.. ఆ హీరోలు వీరే..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో కొందరు క్రికెటర్లు అంచనాలకు మించి రాణించారు. వీరిలో కొందరు ఏమాత్రం అంచనాలు లేకుండానే అదరగొట్టారు. ఇలాంటి వారిపై ఫ్రాంచైజీలు చాలా తక్కువ పెట్టుబడి పెట్టి పైసా వసూల్ ప్రదర్శనలు చేయించుకున్నారు. ఇలా రేటు తక్కువ.. ప్రభావం చాలా ఎక్కువ చూపిన ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం.ఈ జాబితాలో ముందొచ్చే పేరు వైభవ్ సూర్యవంశీ. రాజస్థాన్ రాయల్స్ ఈ 14 ఏళ్ల కుర్ర చిచ్చరపిడుగును కేవలం రూ. 1.1 కోట్లకు సొంతం చేసుకుంది. తీసుకున్న డబ్బుకు వైభవ్ తొలి మ్యాచ్ నుంచే న్యాయం చేస్తూ వచ్చాడు. ఓ విధ్వంసకర సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 206.56 స్ట్రయిక్‌రేట్‌తో 252 పరుగులు చేశాడు.పైసా వసూల్ ప్రదర్శన చేసిన మరో చిచ్చరపిడుగు ప్రియాంశ్ ఆర్య. ఇతగాడిని పంజాబ్ వేలంలో రూ. 3.8 కోట్లకు సొంతం చేసుకుంది. తొలుత ప్రియాంశ్‌పై పంజాబ్ చాలా ఎక్కువ పెట్టుబడి పెట్టిందని అంతా అనుకున్నారు. అయితే అతను ఫ్రాంచైజీ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా, దాదాపు ప్రతి మ్యాచ్‌లో ఇరగదీశాడు. పంజాబ్ ఈ సీజన్లో టేబుల్ టాపర్‌గా నిలవడంలో ప్రియాంశ్ పాత్ర చాలా కీలకం. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో అతను 183.55 స్ట్రయిక్‌రేట్‌తో సెంచరీ, 2 అర్ద సెంచరీల సాయంతో 424 పరుగులు చేశాడు. రేటు తక్కువ, ప్రభావం ఎక్కువ చూపిన మరో ఆటగాడు ర్యాన్ రికెల్టన్. ముంబై ఇండియన్స్ ఇతన్ని కేవలం కోటి రూపాయలకే సొంతం చేసుకుంది. ఇతను దాదాపు ప్రతి మ్యాచ్‌లో ముంబైకు అద్భుతమైన ఆరంభాలు అందించాడు. ఈ సీజన్లో ముంబై ప్లే ఆఫ్స్‌కు చేరడంలో రికెల్టన్ కీలకపాత్ర పోషించాడు. ఇతను 14 మ్యాచ్‌ల్లో 150.97 స్ట్రయిక్‌రేట్‌తో 388 పరుగులు చేశాడు.ఈ సీజన్లో తక్కువ ధరకే అబ్బురపడే ప్రదర్శనలు చేసిన మరో ఆటగాడు అనికేత్ వర్మ. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇతన్ని కేవలం 30 లక్షలకే సొంతం చేసుకుంది. ఇతను ఈ సీజన్లో ఆడిన 12 మ్యాచ్‌ల్లో 166.20 స్ట్రయిక్‌రేట్‌తో 236 పరుగులు చేశాడు. లోయల్ మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు దిగే అనికేత్ అంచనాలకు మించి భారీ హిట్టింగ్ చేసి తన జట్టుకు ఎంతో ఉపయోగపడ్డాడు. హెడ్, అభిషేక్, ఇషాన్ కిషన్, క్లాసెన్ లాంటి విధ్వంసకర వీరులు ఉన్న జట్టులో అనికేత్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.పైన పేర్కొన్న నలుగురే కాకుండా ఈ సీజన్లో రేటు తక్కువ, ప్రభావం చాలా ఎక్కువ చూపిన మరికొందరు ఆటగాళ్లు ఉన్నారు. సీఎస్కే తరఫున ఆయుశ్ మాత్రే (30 లక్షలు), డెవాల్డ్ బ్రెవిస్ (2.2 కోట్లు).. ఆర్సీబీ తరఫున కొద్ది మ్యాచ్‌లే ఆడిన దేవ్‌దత్ పడిక్కల్ (2 కోట్లు), ఢిల్లీ ఆల్‌రౌండర్ విప్రాజ్ నిగమ్ (50 లక్షలు), బౌలర్లలో ఎల్ఎస్జీకి చెందిన దిగ్వేశ్ రాఠీ (30 లక్షలు), ముంబై బౌలర్లు అశ్వనీ కుమార్ (30 లక్షలు), కర్ణ్ శర్మ (50 లక్షలు) అంచనాలకు మించి రాణించి ఈ సీజన్లో మంచి పేరు తెచ్చుకున్నారు. -
LSG VS RCB: రిషబ్ పంత్‌పై మండిపడ్డ అశ్విన్.. సొంత బౌలర్‌నే ఫూల్ చేశాడు..!
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 27) జరిగిన లక్నో-ఆర్సీబీ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ కీలక దశలో సాగుతుండగా లక్నో స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీ మన్కడింగ్‌కు (నాన్ స్ట్రయికర్ ఎండ్‌లోని బ్యాటర్ బంతి వేయకముందే క్రీజ్‌ను దాటిన సమయంలో బౌలర్ వికెట్లను గిరాటు వేయడం) పాల్పడ్డాడు. ఈ విషయమై రాఠీ అప్పీల్ చేసినప్పటికీ.. లక్నో కెప్టెన్ పంత్ దాన్ని విత్‌డ్రా చేసుకున్నాడు. రీప్లే పరిశీలించిన అనంతరం థర్డ్ అంపైర్ దీన్ని నాటౌట్‌గా ప్రకటించాడు.టెక్నికల్‌గా (రాఠీ ఫ్రంట్ ఫుట్ ల్యాండ్ అయ్యే సమయానికి నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న జితేశ్ శర్మ క్రీజ్‌లోనే ఉన్నాడు) ఇది నాటౌటే అయినప్పటికీ.. రూల్స్‌కు విరుద్దం అయితే కాదు. గతంలో చాలా సందర్భాల్లో బౌలర్లు మన్కడింగ్ చేసి బ్యాటర్లను ఔట్ చేశారు. తాజాగా అదే ప్రయత్నం జరిగింది. అయితే ఇక్కడ కెప్టెన్ బౌలర్‌ను సమర్థించకపోవడం చర్చనీయాంశంగా మారింది.అ విషయమై క్రికెట్ సర్కిల్స్లోభిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు రాఠీ చర్యను సమర్దిస్తుంటే.. మరికొందరు పంత్ అప్పీల్‌ను వెనక్కు తీసుకోవడాన్ని తప్పుబడుతున్నారు.రాఠీ చర్యను సమర్దించిన వారిలో సీఎస్కే వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఉన్నాడు. యాష్ ఓ పక్క రాఠీ చర్యను సమర్దిస్తూనే, అప్పీల్‌ను విత్‌డ్రా చేసుకున్న పంత్‌ను తప్పుబట్టాడు. పంత్ అప్పీల్‌ను విత్‌డ్రా చేసుకోవడం వల్ల రాఠీ కోట్లాది మంది అభిమానుల ముందు ఫూల్ అయ్యాడని అభిప్రాయపడ్డాడు. పంత్ రాఠీని జీవితంలో ఇంకోసారి మన్కడింగ్‌కు పాల్పడకుండా చేశాడని మండిపడ్డాడు.మన్కడింగ్ విషయంలో బౌలర్లంటే ఎందుకు అంత చిన్న చూపని ప్రశ్నించాడు. ఓ రకంగా బౌలర్‌కు ఇది అవమానమని అన్నాడు. పంత్ తీసుకున్న నిర్ణయం వల్ల రాఠీ భయపడి ఉంటాడని తెలిపాడు. బౌలర్ చర్యను వెనకేసుకురావడం కెప్టెన్ బాధ్యత అని గుర్తు చేశాడు. ఔటైనా, నాటౌటైనా మన్నడింగ్ అనేది ఆటలో భాగమని అన్నాడు. మ్యాచ్ కీలక దశలో సాగుతుండగా బౌలర్ ఇలాంటి ప్రయత్నం చేయడం తప్పేది కాదని అభిప్రాయపడ్డాడు.కాగా, ఆర్సీబీ 228 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తుండగా ఇన్నింగ్స్ 17వ ఓవర్లో (ఆఖరి బంతికి) ఇది జరిగింది. రాఠీ మన్కడింగ్‌కు పాల్పడే సమయానికి ఆర్సీబీ 19 బంతుల్లో 29 పరుగులు చేయాలి. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. అప్పటకే జితేశ్ శర్మ జోరు మీదున్నాడు. ఒకవేళ జితేశ్ మన్కడింగ్ ద్వారా ఔటయ్యుంటే ఆర్సీబీ కష్టాల్లో పడేది. మ్యాచ్‌ను కూడా కోల్పోవాల్సి వచ్చేది. ఇలాంటి సందర్భంలో పంత్ బౌలర్ అప్పీల్‌ను ఉపసంహరించుకుని ఆర్సీబీకి ఫేవర్ చేశాడు. క్రీడా స్పూర్తి అని పెద్దపెద్ద మాటలు అనుకోవచ్చు కానీ, మ్యాచ్‌ను కాపాడుకునే ప్రయత్నంలో బౌలర్ చేసింది కరెక్టే అని చెప్పాలి. రాఠీ అప్పీల్‌ను పంత్ చిన్నచూపు చూసి తన వ్యక్తిగత ఇమేజ్ను పెంచుకున్నాడు. అంతటితో ఆగకుండా అప్పీల్ విత్‌డ్రా చేసుకున్న తర్వాత జితేశ్‌ను కౌగించుకుని సొంత బౌలర్‌ను అవమానించాడు. మన్కడింగ్ తర్వాత మరింత రెచ్చిపోయిన జితేశ్ కొద్ది బంతుల్లోనే మ్యాచ్‌ను లక్నో చేతుల్లో నుంచి లాగేసుకున్నాడు. -
ఏయ్ నీవు ఏమి చేస్తున్నావు.. కోపంతో ఊగిపోయిన కోహ్లి! వీడియో వైరల్
ఐపీఎల్-2025లో సోమవారం ఎకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. తాత్కాలిక కెప్టెన్ జితేష్ శర్మ తుపాన్ ఇన్నింగ్స్‌తో ఆర్సీబీ టాప్-2 ప్లేస్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఇన్నింగ్స్ 17వ ఓవర్లో హైడ్రామా చోటు చేసుకుంది. లక్నో యువ స్పిన్నర్ దిగ్వేష్ సింగ్ రాఠి మరోసారి తన చర్యతో వార్తల్లోకెక్కాడు.అసలేమి జరిగిందంటే?228 పరుగుల భారీ లక్ష్య చేధనలో విరాట్ కోహ్లి(54) ఔటయ్యాక స్టాండ్ ఇన్ కెప్టెన్ జితేష్ శర్మ క్రీజులోకి వచ్చాడు. జితేష్ తన ఎదుర్కొన్న తొలి బంతి నుంచే బౌండరీలు బదడం మొదలుపెట్టాడు. జితేష్ క్రీజులోకి వచ్చినప్పటికే ఆర్సీబీ కావల్సిన రన్ రేట్ ఓవర్‌కు 13పైగా ఉంది. దీంతో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. బౌలర్లను ఎంతమంది మార్చిన అతడిని ఆపడం ఎవరి తరం కాలేదు.ఈ క్రమంలో అతడి దూకుడును అడ్డుకట్ట వేసేందుకు స్పిన్నర్ దిగ్వేష్‌ను తిరిగి పంత్ ఎటాక్‌లోకి తెచ్చాడు. దీంతో 17 ఓవర్ వేసిన దిగ్వేష్ ఓవరాక్షన్ చేశాడు. జితేష్‌ను తన బౌలింగ్‌తో ఆపలేకపోయిన దిగ్వేష్.. అతడిని మన్కడింగ్ చేసి పెవిలియన్‌కు పంపాలని ప్రయత్నించాడు. ఆ ఓవర్ ఆఖరి బంతిని వేసే క్రమంలో నాన్ స్ట్రైక్‌లో ఉన్న జితేష్ క్రీజు దాటడం గమనించిన దిగ్వేష్ బంతిని డెలివరీ చేయకుండా స్టంప్స్‌ను పడగొట్టాడు. వెంటనే రనౌట్‌కు అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు. పలు మార్లు రిప్లేలు పరిశీలించిన థర్డ్ అంపైర్.. అప్పటికే దిగ్వేశ్ బౌలింగ్ యాక్షన్ పూర్తి చేయడంతో నిబంధనల ప్రకారం నాటౌట్‌గా ప్రకటించాడు.పంత్ క్రీడా స్పూర్తి.. అయితే ఇదే సమయంలో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ క్రీడా స్పూర్తిని ప్రదర్శించాడు. థర్డ్ అంపైర్ తన నిర్ణయం ప్రకటించికముందే పంత్ తమ అప్పీల్‌ను వెనక్కి తీసుకున్నాడు. దీంతో జితేత్.. పంత్‌కు వద్దకు వెళ్లి అలిగంనం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కోహ్లి ఫైర్..కాగా దిగ్వేష్ మన్కడింగ్‌కు ప్రయత్నించడంతో డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్ప విరాట్ కోహ్లి ఊగిపోయాడు. తన చేతిలో ఉన్న బాటిల్‌ను కిందకు విసిరి కొట్టాడు. అస్సలు నీవు ఏమి చేస్తున్నావు అన్నట్లు కోహ్లి సీరియస్ రియాక్షన్ ఇచ్చాడు. కాగా దిగ్వేష్ ఇప్పటికే తన మితిమీరిన ప్రవర్తనతో ఓ మ్యాచ్ నిషేదాన్ని కూడా ఎదుర్కొన్నాడు.థర్డ్ అంపైర్ ఎందుకు నాటౌట్ ఇచ్చాడంటే?మెరిల్‌బోన్ క్రికెట్ నిబంధనల ప్రకారం.. బౌలర్ నాన్ స్ట్రైకర్ బ్యాటర్ ను రనౌట్ చేయాలనుకుంటే యాక్షన్‌ను పూర్తి చేయకముందే ఔట్ చేయాలి. అంటే చేతిని పూర్తిగా తిప్పకముందే వికెట్లను గిరాటు వేయాలి. కానీ దిగ్వేష్ మాత్రం తన బౌలింగ్ యాక్షన్‌ను పూర్తి చేసి స్టంప్స్‌ను పడగొట్టాడు. దీంతో థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. Watch out for Virat’s reaction after Digvesh attempted mankid on Jitesh Sharma. #IPL2025 #IPL #JiteshSharma pic.twitter.com/sAKf6Ck7TV— Akhilesh Dhar (@akhileshdhar1) May 27, 2025 -
ఇద్దరిదీ తప్పే.. మీరు భారత క్రికెటర్లని గుర్తుపెట్టుకోండి: రైనా ఫైర్
లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ దిగ్వేశ్ సింగ్ రాఠీ (Digvesh Singh Rathi)- సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) తీరును టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా తప్పుబట్టాడు. ఈ ఇద్దరు భారత క్రికెటర్ల నుంచి ఇలాంటి అనుచిత ప్రవర్తన ఊహించలేదన్నాడు. అసలేం జరిగిందంటే... లక్నో ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (LSG vs SRH) చేతిలో ఓడింది. సోమవారం జరిగిన ఈ కీలక పోరులో రిషభ్ పంత్ సేన 205 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.పవర్‌ప్లేలో భారీషాట్లతో విరుచుకుపడిన అభిషేక్అయితే, లక్ష్యఛేదనకు దిగిన సన్‌రైజర్స్ ఓపెనర్లలో అభిషేక్... పవర్‌ప్లేలో భారీషాట్లతో విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా రవి బిష్ణోయి బౌలింగ్‌లో వరుసగా నాలుగు సిక్సర్లు బాది సత్తా చాటాడు. మొత్తంగా 20 బంతుల్లోనే 59 పరుగులతో చెలరేగి మ్యాచ్‌ను సన్‌రైజర్స్ వైపు తిప్పేశాడు.గొడవపడిన దిగ్వేశ్, అభిషేక్ఇలా జోరుమీదున్న అభిషేక్ శర్మను దిగ్వేశ్ సింగ్ రాఠీ.. తన రెండో ఓవర్ (ఇన్నింగ్స్ 8వ)లో అవుట్ చేసి ఎప్పట్లాగే నోట్‌బుక్ సంబరాలు చేసుకున్నాడు. వెళ్లు.. వెళ్లు అన్నట్లుగా సైగ చేశాడు. ఈ సమయంలో క్రీజు నుంచి నిష్క్రమిస్తున్న అభిషేక్ దిగ్వేశ్‌ను చూసి ఏదో అన్నాడు.వెంటనే రాఠీ అతడివైపు దూసుకొచ్చి వాగ్వావాదానికి దిగాడు. వెంటనే ఫీల్డ్ అంపైర్లు కల్పించుకోవడంతో ఈ జగడం అక్కడితోనే ఆగిపోయింది. అయితే ఈ సీజన్లో దిగ్వేశ్ రాఠి పరిధి దాటడం ఇది మూడోసారి! ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం దిగ్వేశ్ సింగ్‌పై మ్యాచ్ నిషేధం పడింది.మ్యాచ్ ఆడకుండా నిషేధం‘ఐపీఎల్ ప్రవర్తన నియమావళిని అతిక్రమించిన లక్నో స్పిన్నర్ దిగ్వేశ్ మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించాం. ఈ ఒక్క సీజన్లోనే నియమావళిలోని ‘లెవెల్ 1’ను మూడోసారి అతిక్రమించడంతో 2 డీమెరిట్ పాయింట్లు కూడా విధించాం. ఇదివరకే అతడి ఖాతాలో 3 డీమెరిట్ పాయింట్లు ఉండటంతో మొత్తం 5 డీమెరిట్‌ల కారణంగా ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేటు వేశాం’ అని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఏప్రిల్ 1న పంజాబ్ కింగ్స్‌తో, 4న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌ల్లోనూ దిగ్వేశ్ ఇలాగే అతి సంబరాలతో డీమెరిట్ పాయింట్లకు గురయ్యాడు.అదే విధంగా.. సన్‌రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మపై కూడా ఐపీఎల్ నిర్వాహకులు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. అతడి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత పెట్టడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ జత చేశారు. ఈ ఘటనపై స్పందించిన సురేశ్ రైనా.. దిగ్వేశ్- అభిషేక్‌ల తీరును విమర్శించాడు.మీరు భారత క్రికెటర్లని గుర్తుపెట్టుకోండిస్టార్ స్పోర్ట్స్ కామెంట్రీలో భాగంగా... ‘‘దిగ్వేశ్ రాఠీ నోట్‌బుక్‌లో అభిషేక్ శర్మ పేరు కూడా చేరిపోయింది. అప్పుడే ఈ ‘యుద్ధం’ జరిగింది. నేను నిన్నేమీ అనలేదని దిగ్వేశ్ అభిషేక్‌కు చెప్పినట్లు కనిపించింది.ఏదేమైనా ఇద్దరూ తప్పు చేశారు. ఇద్దరూ భారత ఆటగాళ్లే. వారి నుంచి ఇలాంటి ప్రవర్తన ఊహించలేదు’’ అని సురేశ్ రైనా పెదవి విరిచాడు.గౌరవం ఇవ్వడం నేర్చుకోఅదే విధంగా.. భారత మరో మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ కూడా ఈ ఘటనపై స్పందించాడు. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవడం కాస్త కష్టంగానే ఉన్నా.. తప్పదంటూ దిగ్వేశ్‌ను విమర్శించాడు. అయితే, రాఠీ తన ఆటలో దూకుడు కొనసాగిస్తూనే.. మైదానంలోని ప్రతీ ఆటగాడికి గౌరవం ఇస్తేనే విజయవంతంగా ముందుకు సాగగలడని అభిప్రాయపడ్డాడు. చదవండి: ధోని పాదాలకు నమస్కరించిన వైభవ్.. సీఎస్కే కెప్టెన్ రియాక్షన్ వైరల్ The intensity of a must-win clash! 🔥#DigveshRathi dismisses the dangerous #AbhishekSharma, & things get heated right after! 🗣️💢Is this the breakthrough #LSG needed to turn things around? 🏏Watch the LIVE action ➡ https://t.co/qihxZlIhqW #IPLRace2Playoffs 👉 #LSGvSRH |… pic.twitter.com/TG6LXWNiVa— Star Sports (@StarSportsIndia) May 19, 2025 -
IPL 2025: అభిషేక్ శర్మతో గొడవ.. దిగ్వేశ్ రాఠీపై సస్పెన్షన్ వేటు
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 19) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్ అభిషేక్ శర్మతో గొడవకు దిగినందుకు గానూ లక్నో బౌలర్ దిగ్వేశ్ సింగ్ రాఠీపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చర్యలు తీసుకుంది. రాఠీ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించడంతో పాటు ఓ మ్యాచ్ సస్పెన్షన్ విధించింది. రాఠీ కవ్వింపులకు ప్రతిగా స్పందించిన అభిషేక్ కూడా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోతకు గురయ్యాడు. అభిషేక్ ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ కూడా జమయ్యింది.ABHISHEK vs DIGVESH MOMENT 🤯 pic.twitter.com/oEfs0LWhoe— Johns. (@CricCrazyJohns) May 19, 2025సస్పెన్షన్ కారణంగా రాఠీ లక్నో తదుపరి ఆడబోయే మ్యాచ్‌లో (మే 22న గుజరాత్‌తో) ఆడలేడు. ఈ సీజన్లోనే ఐపీఎల్ అరంగేట్రం చేసిన 23 ఏళ్ల రాఠీ.. సీజన్ ప్రారంభం నుంచి చాలా సార్లు ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌ను ఉల్లంఘించి గవర్నింగ్ కౌన్సిల్ ఆగ్రహానికి గురయ్యాడు. తాజా ఘటనతో ఈ సీజన్లో రాఠీ డీ మెరిట్ పాయింట్ల సంఖ్య ఐదుకు చేరింది. ఈ కారణంగా అతనిపై ఓ మ్యాచ్ సస్పెన్షన్ వేటు పడింది. ఓ సీజన్లో మూడు సార్లు కోడ్‌ను ఉల్లంఘిస్తే ఓ మ్యాచ్ సస్పెన్షన్ విధిస్తారు. రాఠీ ఈ సీజన్లో పంజాబ్ (1), ముంబైతో (2) జరిగిన మ్యాచ్‌ల్లోనూ కోడ్‌ను ఉల్లంఘించి డిమెరిట్ పాయింట్లు మూటగట్టుకున్నాడు.కాగా, దిగ్వేశ్ రాఠీ వికెట్ తీసిన ప్రతిసారి నోట్ బుక్ సెలబ్రేషన్స్ జరుపుకోవడం మేనరిజంగా పెట్టుకున్నాడు. ఎవరి వికెట్ తీసినా ఇదే తంతు కొనసాగిస్తూ వచ్చాడు. తాజాగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అభిషేక్ శర్మ వికెట్ తీసిన ఆనందంలో ఇదే పని చేశాడు. అయితే ఈసారి రాఠీ నోట్ బుక్ సెలబ్రేషన్స్ కాస్త శృతి మించాయి. అభిషేక్‌తో అతను చాలా అవమానకరంగా ప్రవర్తించాడు. వికెట్ తీశాక వెళ్లు.. వెళ్లు అన్నట్లు సైగ చేశాడు. దీంతో పాటు నోటికి కూడా పని చెప్పాడు. రాఠీ ఇంతలా రియాక్డ్ కావడానికి అంతకుముందు అభిషేక్ బాదిన బాదుడే కారణం. రవి బిష్ణోయ్ వేసిన ఇన్నింగ్స్ 7వ ఓవర్లో అభిషేక్ వరుసగా నాలుగు సిక్సర్లు బాదాడు. ఆతర్వాత ఓవర్లో బంతినందుకున్న రాఠీ.. అభిషేక్‌ను తొలి బంతికే ఔట్ చేశాడు. ఈ క్రమంలో నోట్ బుక్ సెలబ్రేషన్స్ చేసుకుని ఓ మ్యాచ్ సస్పెన్షన్‌కు గురయ్యాడు. మ్యాచ్ అనంతరం రాజీవ్ శుక్లా రాజీ కుదుర్చడంతో అభిషేక్, రాఠీ కరచాలనం చేసుకుని, కలియతిరగడం కొసమెరుపు.ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చేతిలో ఓటమిపాలైన లక్నో ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (65), ఎయిడెన్ మార్క్రమ్ (61) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్ 18.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. అభిషేక్ శర్మ తన సహజ శైలిలో ఊచకోత (20 బంతుల్లో 59; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) కోసి సన్‌రైజర్స్ గెలుపుకు బలమైన పునాది వేశాడు. మధ్యలో ఇషాన్ కిషన్ (35), క్లాసెన్ (47), కమిందు మెండిస్ (32 రిటైర్డ్ హర్ట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడగా.. అనికేత్ వర్మ (5 నాటౌట్), నితీశ్ రెడ్డి (5 నాటౌట్) మ్యాచ్‌లను లాంఛనంగా ముగించారు. లక్నో బౌలర్లలో దిగ్వేశ్ రాఠీ 2, విలియమ్ ఓరూర్కీ, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ పడగొట్టారు. -
దిగ్వేష్ సింగ్ ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన అభిషేక్! వీడియో వైరల్
ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ దిగ్వేష్ సింగ్ రథీ మరోసారి తన సెలబ్రేషన్స్‌లో అతి చేశాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. 206 పరుగుల లక్ష్య చేధనలో ఎస్ఆర్హెచ్ ఓపెనర్ దూకుడుగా ఆడాడు.ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో అభిషేక్ ఏకంగా నాలుగు సిక్స్‌లతో 26 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో అతడి దూకుడుకు కళ్లెం వేసేందుకు దిగ్వేష్ సింగ్‌ను లక్నో కెప్టెన్ ఎటాక్‌లోకి తీసుకొచ్చాడు. అయితే పంత్ నమ్మకాన్ని దిగ్వేష్ వమ్ము చేయలేదు. ఆ ఓవర్లో మూడో బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించి అభిషేక్ ఔటయ్యాడు. ఈ క్రమంలో దిగ్వేష్ సెలబ్రేషన్స్ శ్రుతిమించాయి. అభిషేక్ వైపు చూస్తూ కోపంగా ఇక ఆడింది చాలు తన నోట్‌బుక్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. దీంతో డగౌట్‌కు వెళ్లేందుకు సిద్దమైన అభిషేక్ మళ్లీ వెనక్కి వచ్చి దిగ్వేష్‌పై ఫైరయ్యాడు. అతడు కూడా అభిషేక్ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి వాగ్వాదానికి దిగాడు. వెంటనే అంపైర్లు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఈ ఏడాది సీజన్లో ఇప్పటికే దిగ్వేష్ సింగ్‌పై బీసీసీఐ రెండు సార్లు కొరడా ఝళిపించింది. ఓసారి అతడి మ్యాచ్ ఫీజులో 25 శాతం, మరోసారి 50 శాతం కోత బీసీసీఐ విధించింది.Fight between Digvesh Rathi and Abhishek Sharma 😳 pic.twitter.com/8ngcvpnIVK— 𝑺𝒉𝒆𝒓𝒂 (@SheraVK18) May 19, 2025 -
ఇంతకంటే చెత్తగానే ప్రవర్తించారు.. అతడు చేసిన తప్పేంటి?
లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ దిగ్వేశ్ సింగ్ రాఠీ (Digvesh Singh Rathi)కి న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ అండగా నిలిచాడు. రాఠీ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వ్యవహరిస్తున్న తీరు సరికాదని విమర్శించాడు. కాగా ఢిల్లీకి చెందిన దిగ్వేశ్‌ను ఐపీఎల్-2025 (IPL 2025) మెగా వేలంలో లక్నో రూ. 30 లక్షల ధరకు కొనుగోలు చేసింది.25 ఏళ్ల ఈ రైటార్మ్ లెగ్ బ్రేక్ స్పిన్నర్‌పై నమ్మకంతో సీజన్లో తమ తొలి మ్యాచ్‌లోనే తుదిజట్టులో అవకాశం ఇచ్చింది. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సందర్భంగా అరంగేట్రంలోనే దిగ్వేశ్ రెండు వికెట్లు తీసి మేనేజ్మెంట్ అంచనాలు నిజం చేశాడు.‘నోట్‌బుక్’ సంబరాలుఆ తర్వాత కూడా రాణించిన దిగ్వేశ్ పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా సెలబ్రేషన్స్ చేసుకున్న తీరు వైరల్ అయింది. బ్యాటర్‌ను అవుట్ చేయగానే.. అతడి దగ్గరికి వెళ్లి నోట్‌బుక్‌లో వికెట్ నంబర్ రాసుకుంటున్నట్లుగా కాస్త అతిగా సెలబ్రేట్ చేసుకున్నాడు. దీంతో ఐపీఎల్ పాలక మండలి.. ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా వ్యవహరించాడంటూ జరిమానా విధించింది.మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడంతో పాటు.. ఓ డీమెరిట్ పాయింట్ జత చేసింది. ఇక ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ సందర్భంగా కూడా దిగ్వేశ్ రాఠీ మరోసారి ఇదే రీతిలో వికెట్ తీసిన సంబరాన్ని సెలబ్రేట్ చేసుకోగా.. ఈసారి మ్యాచ్ ఫీజులో యాభై శాతం కోత విధించడంతో పాటు మరో డీమెరిట్ పాయింట్ అతడి ఖాతాలో చేరింది. మూడోసారి ఇది రిపీట్ అయితే.. మ్యాచ్ నిషేధం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. పచ్చిక మీద సంతకంఈ నేపథ్యంలో తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో మాత్రం దిగ్వేశ్ తన శైలిని మార్చుకున్నాడు. గత రెండు మ్యాచ్‌ల్లో వికెట్ తీసిన అనంతరం ‘నోట్ బుక్’ సంబరాలతో జరిమానా ఎదుర్కొన్న అతడు.. ఈ మ్యాచ్‌లో తన ఆరాధ్య ప్లేయర్ సునీల్ నరైన్ వికెట్ తీసిన అనంతరం భిన్నంగా సంబరాలు జరుపుకొన్నాడు. ఏడో ఓవర్ రెండో బంతికి నరైన్‌ను అవుట్ చేసిన అనంతరం నేల మీద కూర్చొని పచ్చిక మీద సంతకం పెట్టాడు.Apne idol ka hi chalaan kaat diya 😌😂 pic.twitter.com/HuoxZJj1DX— Lucknow Super Giants (@LucknowIPL) April 8, 2025ఇంతకంటే చెత్తగానే ప్రవర్తించారు.. అతడు చేసిన తప్పేంటి?ఈ పరిణామాలపై కామెంటేటర్ సైమన్ డౌల్ స్పందించాడు. ‘‘ఇలాంటి జరిమానాలను జట్టు యాజమాన్యం కడుతుంది. నాకైతే ఇదేమీ నచ్చడం లేదు. నిజానికి అతడు సెలబ్రేషన్స్ చేసుకున్న తీరు చూసి నాకు ముచ్చటేసింది. అసలు అతడు చేసిన తప్పేంటి?ఇంతకంటే చెత్తగానే ప్రవర్తించారు.. అతడు చేసిన తప్పేంటి?భారత క్రికెటర్లలో చాలా మంది సీనియర్లు ఇంతకంటే అధ్వానంగా సెలబ్రేట్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ వాళ్లకు మాత్రం ఎప్పుడూ జరిమానా వేయలేదు. కానీ ఈ యువ ఆటగాడి పట్ల మాత్రం ఎందుకు ఈ వివక్ష?.. నోట్‌బుక్ సంబరాలను తప్పుపట్టడం ఎంత మాత్రం సరికాదు’’ అని డౌల్ క్రిక్‌బజ్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఇప్పటి వరకు ఐపీఎల్లో ఐదు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న దిగ్వేశ్ సింగ్ రాఠీ ఏడు వికెట్లతో సత్తా చాటాడు. మరోవైపు.. లక్నో జట్టు ఇప్పటిదాకా ఆడిన ఐదు మ్యాచ్‌లలో మూడు గెలిచింది.చదవండి: ఎగిరి గంతేసిన ప్రీతి జింటా.. కోపం పట్టలేక ధోని.. రియాక్షన్స్ వైరల్ -
LSG Vs MI: నువ్విక మారవా?.. లక్నో జట్టుకు రెండు భారీ షాకులు.. పాపం పంత్!
గెలుపు జోష్‌లో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో లక్నో జట్టు తప్పిదానికి గానూ ఐపీఎల్ పాలక మండలి అతడికి జరిమానా విధించింది. నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయనందున రూ. 12 లక్షల ఫైన్ వేసింది.దిగ్వేశ్‌కి మరోసారి షాక్అదే విధంగా.. లక్నో స్పిన్నర్ దిగ్వేశ్ సింగ్ రాఠీకి ఐపీఎల్ పాలక మండలి మరోసారి షాకిచ్చింది. అనుచిత ప్రవర్తనకు గానూ మ్యాచ్ ఫీజులో యాభై శాతం మేర కోత విధించడంతో పాటు.. అతడి ఖాతాలో మరో డీమెరిట్ పాయింట్ జతచేసింది.203 పరుగులుఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా లక్నోలోని ఏకనా స్టేడియంలో ఎల్ఎస్జీ- ముంబై (LSG vs MI) ఇండియన్స్ మధ్య శుక్రవారం మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు సాధించింది.ఓపెనర్లు మిచెల్ మార్ష్ (60), ఐడెన్ మార్క్రమ్ (53), ఆయుశ్ బదోని (30), డేవిడ్ మిల్లర్(27) రాణించారు. ముంబై బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా అత్యధికంగా ఐదు వికెట్లు తీయగా.. విఘ్నేశ్ పుతూర్, అశ్వనీ కుమార్, ట్రెంట్ బౌల్ట్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.పన్నెండు పరుగుల తేడాతోఇక లక్ష్య ఛేదనలో ముంబై ఐదు వికెట్లు నష్టపోయి 191 పరుగులకే పరిమితమైంది. నమన్ ధీర్ (24 బంతుల్లో 46), సూర్యకుమార్ యాదవ్ (43 బంతుల్లో 67), హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 28 నాటౌట్) పోరాటం వృథాగా పోయింది. పన్నెండు పరుగుల తేడాతో లక్నో చేతిలో ముంబై ఓటమి పాలైంది.అయితే, ఈ మ్యాచ్‌లో లక్నో జట్టు నిర్ణీత సమయంలో 20 ఓవర్ల కోటా పూర్తి చేయలేకపోయింది. ఫలితంగా ఆఖరి ఓవర్లో 30 యార్డ్ సర్కిల్‌లోకి అదనంగా ఓ ఫీల్డర్‌ను పిలవాల్సి వచ్చింది. ముంబై విజయానికి చివరి ఓవర్లో 22 పరుగులు అవసరమైన వేళ కేవలం నలుగురు ఫీల్డర్లను మాత్రమే రింగ్ బయట ఉంచాల్సి వచ్చింది. దీనితో పాటు.. స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా ఆ జట్టు కెప్టెన్ పంత్‌కు జరిమానా కూడా పడింది.స్లో ఓవర్ రేటు ‘‘లక్నోలోని భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసినందు వల్ల లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్‌కు జరిమానా విధించడమైనది’’ అని ఐపీఎల్ ఒక ప్రకటన విడుదల చేసింది.ఇదిలా ఉంటే.. దిగ్వేశ్ సింగ్ రాఠీ విషయంలోనూ ఐపీఎల్ పాలక మండలి మరో ప్రకటన జారీ చేసింది. ‘‘లక్నోలోని భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ సందర్భంగా ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన లక్నో బౌలర్ దిగ్వేశ్ సింగ్ మ్యాచ్ ఫీజులో యాభై శాతం కోత విధిస్తున్నాం.మళ్లీ అదే తప్పుఆర్టికల్ 2.5లోని లెవల్ 1 తప్పిదానికి అతడు పాల్పడ్డాడు. ఈ సీజన్లో అతడు నిబంధనలు అతిక్రమించడం ఇది రెండోసారి. మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లోనూ దిగ్వేశ్ రూల్స్ ఉల్లంఘించాడు. అప్పుడు ఒక డీమెరిట్ పాయింట్‌తో పాటు తాజాగా మరో డీమెరిట్ పాయింట్ అతడి ఖాతాలో చేరింది’’ అని సదరు ప్రకటనలో పేర్కొంది. అయితే, దిగ్వేశ్కు ఫైన్ వేయడానికి గల కారణం.. నమన్ వికెట్ తీసిన తర్వాత.. మరోసారి నోట్‌బుక్‌లో రాస్తున్నట్లుగా సెలబ్రేట్ చేసుకోవడం అని తెలుస్తోంది.నువ్విక మారవా? .. పాపం పంత్!కాగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో.. లక్నో జట్టులోని మిగతా బౌలర్లతో పోలిస్తే దిగ్వేశ్ సింగ్ పొదుపుగా బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 21 పరుగులే ఇచ్చి.. నమన్ ధీర్ రూపంలో కీలక వికెట్ తీశాడు. ఈ క్రమంలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. కానీ తన అనుచిత ప్రవర్తనతో ఇలా మరోసారి శిక్షను అనుభవించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు దిగ్వేశ్‌పై.. ‘‘మారవా.. నువ్విక మారవా?’’ అంటూ మీమ్స్ ట్రోల్స్ చేస్తున్నారు. మరోవైపు..బ్యాటర్‌గా విఫలమవుతున్న పంత్‌కు ఇలా సారథిగానూ ఎదురుదెబ్బ తగలడం పట్ల.. ‘పాపం పంత్’ అంటూ సెటైర్లు వేస్తున్నారు.చదవండి: హిట్టర్లు అవసరం.. అందుకే తిలక్‌ను వెనక్కి పంపించాం: హార్దిక్ Just the breakthrough #LSG needed! Avesh Khan's change in pace does the trick as LSG dismiss Surya Kumar Yadav at a crucial juncture! 👊Updates ▶️ https://t.co/HHS1Gsaw71#TATAIPL | #LSGvMI | @LucknowIPL pic.twitter.com/KKptbNOjLI— IndianPremierLeague (@IPL) April 4, 2025 -
లక్నో బౌలర్ ఓవరాక్షన్.. భారీ షాకిచ్చిన బీసీసీఐ
లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ దిగ్వేశ్ సింగ్ రాఠీ (Digvesh Singh Rathi)కి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) గట్టి షాకిచ్చింది. వికెట్ తీసిన సంబరంలో ‘అతి’ చేసినందుకు గానూ జరిమానా విధించింది. మ్యాచ్ ఫీజులో 25 శాతం మేర కోత వేయడంతో పాటు.. అతడి ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్‌ను జత చేసింది. అసలేం జరిగిందంటే..ఐపీఎల్-2025లో భాగంగా లక్నో మంగళవారం పంజాబ్ కింగ్స్ (Punjab Kings)తో మ్యాచ్ ఆడింది. ఏకనా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన లక్నో తొలుత బ్యాటింగ్ చేసింది. ఐడెన్ మార్క్రమ్ (18 బంతుల్లో 28), నికోలస్ పూరన్ (30 బంతుల్లో 44), ఆయుశ్ బదోని (33 బంతుల్లో 41), అబ్దుల్ సమద్ (12 బంతుల్లో 27) రాణించారు.అర్ష్‌దీప్ సింగ్‌కు మూడు వికెట్లుఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో లక్నో జట్టు ఏడు వికెట్ల నష్టానికి 171 పరుగులు స్కోరు చేసింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లతో మెరవగా.. లాకీ ఫెర్గూసన్, గ్లెన్ మాక్స్వెల్, మార్కో యాన్సెన్, యజువేంద్ర చహల్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ప్రియాన్ష్ ఆర్య విఫలంఇక లక్ష్య ఛేదన మొదలుపెట్టిన కాసేపటికే పంజాబ్.. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య వికెట్ కోల్పోయింది. లక్నో స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీ అవుట్‌సైడ్ ఆఫ్ దిశగా.. సంధించిన షార్ట్ బంతిని ఆడే క్రమంలో బ్యాట్ టాప్ ఎడ్జ్‌కు తగిలింది. అయితే, షాట్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో గాల్లోకి లేచిన బంతిని.. మిడాన్ నుంచి పరిగెత్తుకుని వచ్చిన ఫీల్డర్ శార్దూల్ ఠాకూర్ ఒడిసిపట్టాడు.రాఠీ ‘ఓవరాక్షన్’ఈ క్రమంలో మొత్తంగా తొమ్మిది బంతులు ఎదుర్కొన్న ప్రియాన్ష్ 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. అయితే, అతడు క్రీజు వీడుతున్న సమయంలో దగ్గరికి పరిగెత్తుకు వచ్చిన దిగ్వేశ్ రాఠీ ‘ఓవరాక్షన్’ చేశాడు. పుస్తకంలో అతడి పేరును రాసుకుంటున్నట్లుగా వికెట్ తీసిన ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు.#DigveshRathi provides the breakthrough as #PriyanshArya heads back!P.S: Don't miss the celebration at the end! 👀✍🏻Watch LIVE action of #LSGvPBKS ➡ https://t.co/GLxHRDQajv#IPLOnJiostar | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi & JioHotstar! | #IndianPossibleLeague pic.twitter.com/TAhHDtXX8n— Star Sports (@StarSportsIndia) April 1, 2025 ఈ నేపథ్యంలో దిగ్వేశ్ రాఠీ చర్యను తీవ్రంగా పరిగణించిన ఐపీఎల్ పాలక మండలి అతడిపై కఠిన చర్యలు తీసుకుంది. ఇందుకు సంబంధించి ఐపీఎల్ మీడియా అడ్వైజరీ కమిటీ ప్రకటన విడుదల చేసింది. జరిమానా‘‘ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5లో గల లెవల్ 1 నిబంధనను దిగ్వేశ్ రాఠీ అతిక్రమించాడు. మ్యాచ్ రిఫరీ నిర్ణయం ప్రకారం అతడిపై చర్యలు తీసుకున్నాం’’ అని పేర్కొంది. మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడంతో పాటు డీమెరిట్ పాయింట్ జతచేసినట్లు వెల్లడించింది.కాగా ఢిల్లీకి చెందిన దిగ్వేశ్ సింగ్ రాఠీ ఈ ఏడాదే ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో లక్నో మ్యాచ్ సందర్భంగా విశాఖపట్నం వేదికగా ఎంట్రీ ఇచ్చిన ఈ రైటార్మ్ స్పిన్నర్ తొలి మ్యాచ్‌లోనే రెండు వికెట్లు తీశాడు. ఇప్పటి వరకు మొత్తంగా మూడు మ్యాచ్‌లలో కలిపి ఐదు వికెట్లు పడగొట్టాడు.పంజాబ్ ఘన విజయంఇక మ్యాచ్ విషయానికొస్తే.. ప్రియాన్ష్ ఆర్య వికెట్ తీసిన ఆనందం లక్నోకు ఎంతో సేపు నిలవలేదు. మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (34 బంతుల్లో 69) అర్ధ శతకంతో చెలరేగగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (30 బంతుల్లో 52), నేహాల్ వధేరా (25 బంతుల్లో 43) ధనాధన్ దంచికొట్టి అజేయంగా ఇన్నింగ్స్‌తో.. జట్టును విజయతీరాలకు చేర్చారు. 16.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన పంజాబ్ ఎనిమిది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.చదవండి: రూ. 27 కోట్లు దండుగ!.. పంత్‌కు గట్టిగానే క్లాస్ తీసుకున్న గోయెంకా!