
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ దిగ్వేష్ సింగ్ రథీ మరోసారి తన సెలబ్రేషన్స్‌లో అతి చేశాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. 206 పరుగుల లక్ష్య చేధనలో ఎస్ఆర్‌హెచ్ ఓపెనర్ దూకుడుగా ఆడాడు.
ఎస్ఆర్‌హెచ్ ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో అభిషేక్ ఏకంగా నాలుగు సిక్స్‌లతో 26 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో అతడి దూకుడుకు కళ్లెం వేసేందుకు దిగ్వేష్ సింగ్‌ను లక్నో కెప్టెన్ ఎటాక్‌లోకి తీసుకొచ్చాడు. అయితే పంత్ నమ్మకాన్ని దిగ్వేష్ వమ్ము చేయలేదు. ఆ ఓవర్‌లో మూడో బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించి అభిషేక్ ఔటయ్యాడు. ఈ క్రమంలో దిగ్వేష్ సెలబ్రేషన్స్ శ్రుతిమించాయి.
అభిషేక్ వైపు చూస్తూ కోపంగా ఇక ఆడింది చాలు తన నోట్‌బుక్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. దీంతో డగౌట్‌కు వెళ్లేందుకు సిద్దమైన అభిషేక్ మళ్లీ వెనక్కి వచ్చి దిగ్వేష్‌పై ఫైరయ్యాడు. అతడు కూడా అభిషేక్ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి వాగ్వాదానికి దిగాడు. వెంటనే అంపైర్‌లు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటికే దిగ్వేష్ సింగ్‌పై బీసీసీఐ రెండు సార్లు కొరడా ఝళిపించింది. ఓసారి అతడి మ్యాచ్ ఫీజులో 25 శాతం, మరోసారి 50 శాతం కోత బీసీసీఐ విధించింది.
Fight between Digvesh Rathi and Abhishek Sharma 😳 pic.twitter.com/8ngcvpnIVK
— 𝑺𝒉𝒆𝒓𝒂 (@SheraVK18) May 19, 2025