దిగ్వేష్‌-రాణా మధ్య వాగ్వాదం.. కొట్టుకునేంత వరకు వెళ్లారు! వీడియో | Digvesh Singh Rathi and Nitish Rana's Heated Argument in DPL 2025 Elimination Match | Sakshi
Sakshi News home page

DPL 2025: దిగ్వేష్‌-రాణా మధ్య వాగ్వాదం.. కొట్టుకునేంత వరకు వెళ్లారు! వీడియో

Aug 30 2025 1:06 PM | Updated on Aug 30 2025 2:36 PM

Nitish Rana, Digvesh Rathi in heated fight as DPL knockout turns ugly with brawls

ఢిల్లీ యువ స్పిన్నర్‌, లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ దిగ్వేష్ సింగ్ రథీ.. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రాస్‌గా నిలుస్తున్నాడు. ఐపీఎల్‌-2025లో తన నోట్ బుక్ సెలబ్రేషన్స్‌తో బీసీసీఐ అగ్రహానికి గురైన దిగ్వేష్‌.. ఇప్పుడు ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో కూడా అదే తీరును కనబరిచాడు. ఈ టోర్నీలో సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్‌కు దిగ్వేష్ సింగ్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

అయితే శుక్రవారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఎలిమినేటర్‌లో సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్‌, వెస్ట్ ఢిల్లీ లయన్స్ జట్లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్‌లో దిగ్వేష్, వెస్ట్ ఢిల్లీ కెప్టెన్ నితీష్ రాణా మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

అసలేమి జరిగిదంటే?
వెస్ట్ ఢిల్లీ ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేయడానికి వచ్చిన దిగ్వేష్‌ను రాణా గ్రాండ్ వెలకమ్ పలికాడు. ఆ ఓవర్‌లో రాణా మూడు సిక్స్‌లు, ఒక ఫోర్‌తో మొత్తంగా 22 పరుగులు పిండుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ దిగ్వేష్ బౌలింగ్‌లో ఒక ఫోర్, 2 సిక్స్​లు కొట్టాడు. దీంతో దిగ్వేష్ తన సహనాన్ని కోల్పోయాడు. రాణా ఏకాగ్రాతను దెబ్బతీసేందుకు మైండ్ గేమ్స్ ఆడాడు. 

దీంతో అతడిని స్లెడ్జ్ చేయడం దిగ్వేష్ మొదలు పెట్టాడు.  తన మూడో ఓవర్ వేయడానికి వచ్చిన ఈ లక్నో స్పిన్నర్ బంతిని వేసేందుకు ముందుకు వచ్చి కావాలనే ఒక్కసారిగా ఆపేశాడు. అతడి చర్య రాణాకు అగ్రహాం తెప్పించింది. దిగ్వేశ్​ రాఠీ మరో బంతి వేసేటప్పుడు రాణా పక్కకు తప్పుకున్నాడు. వెంటనే దిగ్వేష్  రాణాను  ఏదో అన్నాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్దం చోటు చేసుకుంది. ఈ క్ర‌మంలో అంపైర్‌లు, స‌హ‌చ‌ర ఆట‌గాళ్లు జోక్యం చేసుకోవ‌డంతో గొడ‌వ స‌ద్దుమ‌ణిగింది.


క్రిష్‌- సుమిత్‌ మధ్య గొడవ
ఇదే కాకుండా ఈ మ్యాచ్‌లో మ‌రో ఇద్ద‌రి ఆట‌గాళ్ల మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది.  సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్ ప్లేయర్‌ సుమిత్ మాథుర్, వెస్ట్‌ ఢిల్లీ ఆటగాడు క్రిష్‌ యాదవ్‌ కొట్టుకునేంత పనిచేశారు. 11 ఓవర్‌ వేసిన అమన్‌ భారతి బౌలింగ్‌లో లాంగ్-ఆఫ్ కోసం సిక్స్ కొట్టడానికి ప్రయత్నించి క్రిష్‌ ఔటయ్యాడు.

దీంతో సౌత్‌ ఢిల్లీ ఆటగాళ్లు సంబరాల్లో మునిగి తేలిపోయాడు. ఈ క్రమంలో ఔట్​ అయిన క్రిష్​ ప్రత్యర్థి ఆటగాడితో గొడవకు దిగాడు. ఒకరిపైకి ఒకరు దూసుకొచ్చారు. అయితే అంతకు ముందు దిగ్వేశ్​తో గొడవ పడిన నితీశ్ ఈసారి శాంతికాముకుడిగా వ్యవహరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. కాగా ఎలిమినేటర్‌ రౌండ్‌లో విజయం సాధించిన వెస్ట్‌ ఢిల్లీ క్వాలిఫయర్‌-2కు ఆర్హత సాధించింది.
చదవండి: Bengaluru Stampede: ఆర్సీబీ కీలక ప్రకటన.. ఒక్కొక్కరికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement