ఆర్సీబీ కీలక ప్రకటన.. ఒక్కొక్కరికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా | RCB Announces ₹25 Lakh Ex-Gratia for Families of Stampede Victims at Chinnaswamy Stadium | Sakshi
Sakshi News home page

Bengaluru Stampede: ఆర్సీబీ కీలక ప్రకటన.. ఒక్కొక్కరికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా

Aug 30 2025 11:19 AM | Updated on Aug 30 2025 11:43 AM

RCB announce Rs 25 lakh each for families who lost members in Bengaluru stampede

ఆర్సీబీ విజయోత్సవాల వేళ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాల‌ను కోల్పోయిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇటీవలే బాధిత కుటంబాలకు అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం.. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు  ఒక్కొక్కరికి రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.

"జూన్ 4, 2025న మా హృదయాలు ముక్క‌లయ్యాయి. ఆ రోజు ఆర్సీబీ కుటంబంలోని ప‌ద‌కొండు మంది స‌భ్యుల‌ను మేము కోల్పోయాము. వారంతా మాలో భాగ‌మే. మా జ‌ట్టును ప్ర‌త్యేకంగా తీర్చిదిద్ద‌డంలో వారిది కీల‌క పాత్ర‌. వారు లేని లోటు పూడ్చలేనిది. ప్ర‌తీ ఒక్క‌రిలోనూ వారి జ్ఞాపకాలను చూసుకుంటాము. 

కానీ మా మొద‌టి అడుగుగా వారి కుటుంబాల‌కు ఒక్కొక్కరికి రూ. 25 ల‌క్ష‌లు న‌ష్ట‌ప‌రిహారంగా ఇచ్చాము. కేవ‌లం ఒక్క ఆర్ధిక స‌హాయం మాత్ర‌మే కాకుండా భవిష్య‌త్తులో వారికి అన్ని విధాల‌గా స‌పోర్ట్‌గా ఉంటాము. అందుకోసం 'ఆర్సీబీ కేర్స్' పని చేస్తుంది" అని ఆర్సీబీ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

అసలేమి జరిగిందంటే?
అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన ఫైన‌ల్లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించిన ఆర్సీబీ.. పదిహేడేళ్ల త‌ర్వాత తొలి ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది. దీంతో బెంగ‌ళూరు అభిమానుల సంబ‌రాలు అంబ‌రాన్ని అంటాయి. ఈ క్ర‌మంలో ఆర్సీబీ ఫ్రాంచైజీ సైతం విజయయాత్రను ఘనంగా చేసుకోవాలని భావించింది.

బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో విజ‌యోత్స‌వ వేడుక‌ల‌ను నిర్వ‌హించాల‌ని ఆర్సీబీ ప్లాన్ చేసింది. అయితే అందుకు త‌గ్గ ఏర్పాట్లు చేయకపోవడంతో తీరని విషాదం నెలకొంది. భారీ సంఖ్య‌లో అభిమానులు త‌ర‌లిరావ‌డంతో తొక్కిసలాట చోటు చేసుకుంది.

ఈ ఘ‌ట‌న‌లో మొత్తం 11 మంది మృత్యవాత పడగా.. యాభై మందికి పైగా గాయాలపాలయ్యారు. దీంతో ఆర్సీబీ యాజమాన్యంపై కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌ (CAT) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు బాధ్యులగా  ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలే, డీఎన్ఎ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ముగ్గురు సిబ్బందిని  పోలీసులు అరెస్ట్ చేశారు.
చదవండి: Manoj Tiwary: 'నా కెరీర్‌లో సెహ్వాగ్ త్యాగం మరువలేనిది.. ఎప్పుడూ రుణపడి ఉంటా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement