ఇటీవల జరిగిన టెస్ట్ సిరీస్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన ఘోర పరాభవానికి (0-2తో క్లీన్ స్వీప్) టీమిండియా గట్టిగానే ప్రతీకారం తీర్చుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నిన్న (నవంబర్ 30) జరిగిన తొలి వన్డేలో (India vs South Africa) ఘన విజయం సాధించింది. తద్వారా సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు సఫారీలకు చుక్కలు చూపించింది.
విరాట్ కోహ్లి (Virat Kohli) 52వ వన్డే శతకంతో చెలరేగిపోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోర్ చేసింది. రోహిత్ శర్మ (57), కేఎల్ రాహుల్ (60) కూడా అర్ద సెంచరీలతో సత్తా చాటారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఆదిలో తబడిన సౌతాఫ్రికా, ఆతర్వాత అనూహ్యంగా పుంజుకొని కాసేపు టీమిండియాను భయపెట్టింది. మిడిలార్డర్ బ్యాటర్లు మాథ్యూ బ్రీట్జ్కే (72), జన్సెన్ (70), కార్బిన్ బాష్ (67) ఊహించని రీతిలో ప్రతిఘటించి టీమిండియా శిబిరంలో గుబులు పుట్టించారు.
అంతింగా భారత్‌దే పైచేయి అయినప్పటికీ సఫారీల పోరాటం అందరినీ ఆకట్టుకుంది. 49.2 ఓవర్లలో ఆ జట్టు 332 పరుగులు చేసి లక్ష్యానికి 18 పరుగుల దూరంలో నిలిచిపోయింది.
ఈ మ్యాచ్‌లో ఓడినా సౌతాఫ్రికా (South Africa) ఓ విషయంలో చరిత్ర సృష్టించింది. వన్డే లక్ష్య ఛేదనల్లో 15 పరుగులలోపే 3 వికెట్లు కోల్పోయి అంతిమంగా 300 పరుగులు చేసిన తొలి జట్టుగా రికార్డు నెలకొల్పింది. దీనికి ముందు ఈ రికార్డు పాకిస్తాన్ పేరిట ఉండేది. 2019లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ లక్ష్య ఛేదనలో 6 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి, అంతిమంగా 297 పరుగులు చేసింది.


