
మనోజ్ తివారీ.. భారత జట్టులోకి ఇలా వచ్చి అలా వెళ్లిపోయిన క్రికెటర్లలో ఒకడు. దేశవాళీ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బెంగాల్ మాజీ కెప్టెన్‌కు అంతర్జాతీయ స్ధాయిలో మాత్రం పెద్దగా ఆడే అవకాశం రాలేదు. 39 ఏళ్ల తివారీ 2011లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో తన తొలి అంతర్జాతీయ సెంచరీ నమోదు చేశాడు.
తన అద్బుత ప్రదర్శనకు గానూ మనోజ్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. అయితే సెంచరీ చేసినప్పటికి తర్వాత సిరీస్‌లకు అతడిని జట్టు నుంచి తప్పించారు. అప్పుడు భారత జట్టు కెప్టెన్‌గా ఎంఎస్ ధోని ఉన్నాడు. దీంతో ధోని తన అన్యాయం చేశాడని తివారీ ఆరోపించాడు.
అయితే తాజాగా మరోసారి తన అంతర్జాతీయ కెరీర్‌పై తివారీ కీలక వ్యాఖ్యలు చేశాడు. తన కెరీర్‌లో భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పాత్ర ఎప్పటికి మరవలేనది అని తివారీ చెప్పుకొచ్చాడు.
"భారత జట్టుకు ఆడే సమయంలో వీరేంద్ర సెహ్వాగ్ నాకు చాలా సపోర్ట్‌గా ఉండేవాడు. వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో నేను సెంచరీ చేసి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలవడంలో వీరూ పాజీది కీలక పాత్ర. నా కోసం తన స్ధానాన్ని త్యాగం చేశాడు. విండీస్‌తో జరిగిన నాలుగో వన్డేలో సెహ్వాగ్ డబుల్ సెంచరీ సాధించాడు.
ఆ సిరీస్‌కు ధోని లేకపోవడంతో వీరూనే జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. అయితే చెన్నై వేదికగా జరిగిన ఐదో వన్డేకు ముందు అతడు ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. నాకు తుది జట్టులో చోటు ఇచ్చేందుకు ఆఖరి వన్డేకు వీరూ దూరమయ్యాడు.
నా కెరీర్‌ను చాలా దగ్గర నుంచి చూసిన సెహ్వాగ్.. జట్టులో నాకు కొంచెం అన్యాయం జరుగుతోందని భావించాడు. అందుకే ఆ మ్యాచ్‌లో తన స్ధానాన్ని నాకోసం త్యాగం చేశాడు. బస్‌లో వెళ్తుంగా ఏ స్ధానంలో బ్యాటింగ్ చేయడం ఇష్టమని అతడు నాకు అడిగాడు.
భారత్ తరపున ఆడడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను, ఏ స్ధానంలో బ్యాటింగ్‌కైనా సిద్దమని వీరూ పాజీతో చెప్పాను. కానీ అతడు మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఎక్కువగా ఏ స్ధానంలో బ్యాటింగ్ చేసేవాడివి అని అడిగాడు. అందుకు నేను నాలుగో స్ధానమని సమాధానిమిచ్చాను.
దీంతో నన్ను నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు పంపుతా అని సెహ్వాగ్ చెప్పాడు. ఇదే విషయాన్ని ఆఖరి మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన గౌతమ్ గంభీర్‌కు వీరూ తెలియజేశాడు. దీంతో నాలుగో స్ధానంలో వచ్చి నా తొలి అంతర్జాతీయ సెంచరీని సాధించగలిగాను. కాబట్టి నా చివరి శ్వాసవరకు అతనికి రుణపడి ఉంటాను" అని క్రిక్ ట్రాకర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తివారీ పేర్కొన్నాడు. తివారీ తన కెరీర్‌లో భారత తరుపన 12 వన్డేలు, మూడు టీ20లు ఆడాడు.
చదవండి: Manoj Tiwary: 'నా కెరీర్‌లో సెహ్వాగ్ త్యాగం మరువలేనిది.. ఎప్పుడూ రుణపడి ఉంటా'