ప్రపంచ రికార్డులు సృష్టించిన కోహ్లి.. సచిన్‌ను దాటేసి తొలి ప్లేయర్‌గా.. | Virat Kohli Creates History With 52nd ODI Century, Surpasses Sachin Tendulkar And Check Out His Multiple World Records | Sakshi
Sakshi News home page

Kohli World Records: ప్రపంచ రికార్డులు సృష్టించిన కోహ్లి.. సచిన్‌ను దాటేసి తొలి ప్లేయర్‌గా..

Nov 30 2025 5:02 PM | Updated on Dec 1 2025 12:51 PM

IND vs SA 1st ODI: Kohli Creates Multiple World Records Surpasses Sachin

భారత క్రికెట్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లి సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నాడు. సౌతాఫ్రికాతో తొలి వన్డే సందర్భంగా సెంచరీతో చెలరేగిన కింగ్‌... యాభై ఓవర్ల ఫార్మాట్లో పలు ప్రపంచ రికార్డులు సృష్టించాడు.

సచిన్‌ టెండుల్కర్‌ రికార్డును బద్దలు
రాంచి వేదికగా ప్రొటిస్‌ జట్టుతో ఆదివారం నాటి మ్యాచ్‌లో కోహ్లి (Virat Kohli) 102 బంతుల్లో శతక మార్కు అందుకున్నాడు. ఈ క్రమంలో వన్డేల్లో 52వ సెంచరీ నమోదు చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌... సింగిల్‌ ఫార్మాట్లో అత్యధిక​ శతకాల వీరుడిగా ఉన్న టీమిండియా బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ (Sachin Tendulkar) రికార్డును బద్దలు కొట్టాడు.

ఏకైక బ్యాటర్‌గా
కాగా శతక శతకాల వీరుడు సచిన్‌ టెస్టుల్లో 51 సెంచరీలు చేయగా.. కోహ్లి వన్డేల్లో 52వసారి వంద పరుగుల మార్కు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఒకే ఫార్మాట్లో అత్యధిక శతకాలు సాధించిన ఏకైక బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు.

అంతేకాదు వన్డేల్లో భారత్‌లో ఒకే వేదికపై అతి తక్కువ ఇన్నింగ్స్‌లోనే మూడు శతకాలు బాదిన బ్యాటర్‌గా కోహ్లి నిలిచాడు. కోహ్లి రాంచిలో ఐదు ఇన్నింగ్స్‌లో మూడు శతకాలు బాదగా.. సచిన్‌ వడోదరలో ఏడు ఇన్నింగ్స్‌లో మూడుసార్లు​ శతక్కొట్టాడు.

అదే విధంగా.. సౌతాఫ్రికాతో వన్డేల్లో అత్యధిక సెంచరీ సాధించిన క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. ప్రొటిస్‌ జట్టుపై కోహ్లికి ఇది ఆరో శతకం. అంతకు ముందు ఈ రికార్డు సచిన్‌ టెండుల్కర్‌, డేవిడ్‌ వార్నర్‌ (David Warner) పేరిట ఉండేది. వీరిద్దరు సౌతాఫ్రికాపై చెరో ఐదు శతకాలు బాదారు.

అరుదైన నంబర్‌
అంతర్జాతీయ పురుషుల క్రికెట్‌లో కోహ్లి తాజాగా సాధించిన 83వ సెంచరీ (టెస్టుల్లో 30, వన్డేల్లో 52, టీ20లలో ఒకటి)కి చరిత్ర పుటల్లో ప్రత్యేక స్థానం దక్కనుంది. కోహ్లి హండ్రెడ్‌ బాదడంతో మెన్స్‌ క్రికెట్‌లో వ్యక్తిగత శతకాల సంఖ్య 7000కు చేరింది. దీంతో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో ఓవరాల్‌గా 7000వ సెంచరీ కోహ్లి పేరిట లిఖించబడింది.  

భారత్‌ స్కోరెంతంటే?
కాగా సౌతాఫ్రికాతో తొలి వన్డేలో కోహ్లి మొత్తంగా 120 బంతులు ఎదుర్కొని పదకొండు ఫోర్లు, ఏడు సిక్స్‌ల సాయంతో 135 పరుగులు సాధించాడు. రోహిత్‌ శర్మతో రెండో వికెట్‌కు 136 పరుగులు జోడించిన కోహ్లి.. కేఎల్‌ రాహుల్‌ (60)తో కలిసి ఐదో వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 

వీరితో పాటు రవీంద్ర జడేజా (32) కూడా రాణించడంతో టీమిండియా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 349 పరుగులు సాధించింది. 
చదవండి: రాక రాక వచ్చిన అవకాశం.. ఇలా చేస్తావా?.. ఫ్యాన్స్‌ ఫైర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement