టీమిండియా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు సాధించాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిన్ ఆఫ్రిది పేరిట ఉన్న రికార్డును హిట్‌మ్యాన్ బ్రేక్ చేశాడు. సౌతాఫ్రికాతో ఆదివారం నాటి తొలి వన్డే సందర్భంగా రోహిత్ శర్మ ఈ ఘనత సాధించాడు.
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సొంతగడ్డపై ప్రొటిస్ జట్టుతో రాంచి వేదికగా తొలి మ్యాచ్‌లో.. టాస్ ఓడిన భారత్ మొదట బ్యాటింగ్‌కు దిగింది . ఓపెనర్ యశస్వి జైస్వాల్ (18) నిరాశపరచగా.. మరో ఓపెనర్ రోహిత్ శర్మ నిలకడగా ఆడుతూ వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డాడు.
ఈ క్రమంలో రోహిత్‌కు తోడైన వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆది నుంచే దూకుడు ప్రదర్శించాడు. వీరిద్దరు అదరగొట్టడంతో పవర్ ప్లేలో (10 ఓవర్లు) భారత్ వికెట్ నష్టానికి 80 పరుగులు సాధించింది.
తద్వారా వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత వన్డేల్లో తొలి పది ఓవర్లలో మొదటిసారి ఈమేర అత్యధిక స్కోరు సాధించింది. ఇక రోహిత్- కోహ్లి స్థాయికి తగ్గట్లు చెలరేగడంతో డ్రింక్స్ విరామ సమయానికి (16 ఓవర్లలో) మరో వికెట్ నష్టపోకుండా 122 పరుగులు సాధించింది.
రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు
రోహిత్ శర్మ 36 బంతుల్లో 45, కోహ్లి 44 బంతుల్లో 45 పరుగులతో క్రీజులో నిలిచారు. ఇక భారత ఇన్నింగ్స్ 15వ ఓవర్లో ప్రొటిస్ స్పిన్నర్ సుబ్రేయన్ రంగంలోకి దిగగా.. అతడి బౌలింగ్‌లో తొలి రెండు బంతుల్లో రోహిత్ వరుసగా సిక్సర్లు బాదాడు.
Just one Ro-𝗛𝗜𝗧 away from history! 👀🔥@ImRo45 now has the joint-most 6️⃣s in ODIs!
He reached his fifty with some classy attacking strokes along the way! 🏏🔥#INDvSA 1st ODI, LIVE NOW 👉 https://t.co/BBkwein9oF#RohitSharma pic.twitter.com/DbJ822jVda— Star Sports (@StarSportsIndia) November 30, 2025
ఈ క్రమంలోనే వన్డేల్లో తన 352వ సిక్సర్‌ను రోహిత్ నమోదు చేశాడు. తద్వారా పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది (351 సిక్సర్లు) పేరిట ఉన్న వన్డే సిక్సర్ల రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. అనంతరం రోహిత్ 57(51 బంతుల్లో) పరుగుల వద్ద మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుగదిరిగాడు.
కోహ్లి అర్ద శతకం
మరోవైపు... కోహ్లి అర్ద శతకం పూర్తి చేసుకున్నాడు. కార్బిన్ బాష్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాది కెరీర్‌లో 76వ వన్డే ఫిఫ్టీ సాధించాడు. ఈ క్రమంలోనే 26 ఓవర్లలో టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 182 పరుగులు స్కోరు చేసింది. కాగా 57 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్ మార్కో యాన్సెన్ బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరిగాడు. మొత్తంగా 51 బంతులు ఎదుర్కొన్న హిట్‌మ్యాన్ ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి.
చదవండి: శతక్కొట్టిన అభిషేక్ శర్మ.. సిక్సర్ల వర్షం.. సరికొత్త చరిత్ర


