
ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2025లో వెస్ట్ ఢిల్లీ లయన్స్ జట్టు క్వాలిఫయర్ 2కు ఆర్హత సాధించింది. శుక్రవారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఎలిమినేటర్‌లో సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్‌పై 7 వికెట్ల తేడాతో వెస్ట్ ఢిల్లీ ఘన విజయం సాధించింది. దీంతో శనివారం క్వాలిఫయర్-2లో ఈస్ట్ ఢిల్లీ రైడర్స్‌తో వెస్ట్ ఢిల్లీ తలపడనుంది.
కాగా ఎలిమినేటర్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్ బ్యాటర్లలో అన్మోల్ శర్మ(55), తేజస్వి దహియా(33 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 60) హాఫ్ సెంచరీలతో మెరవగా.. సుమిత్ మాథుర్(26 బంతుల్లో48) మెరుపులు మెరిపించాడు. వెస్ట్ ఢిల్లీ బౌలర్లలో హృతిక్ షోకీన్ రెండు వికెట్లు పడగొట్టగా.. శుబమ్ దుబే, శివాంక్, అనిరుద్ చౌదరి తలా వికెట్ సాధించారు.
నితీష్ విధ్వంసం..
అనంతరం 202 పరుగుల లక్ష్య చేధనలో వెస్ట్ ఢిల్లీ 21 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో వెస్ట్ ఢిల్లీ కెప్టెన్ నితీష్ రాణా విధ్వంసం సృష్టించాడు. ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.అరుణ్ జైట్లీ స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో రాణా కేవలం 42 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
ఓవరాల్‌గా 55 బంతులు ఎదుర్కొన్న నితీష్.. 8 ఫోర్లు, 15 సిక్స్‌ల సాయంతో 134 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. దీంతో 202 పరుగుల లక్ష్యాన్ని వెస్ట్ ఢిల్లీ 17.1 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.
చదవండి: ZIM vs SL: శ్రీలంకను వణికించిన జింబాబ్వే.. ఉత్కంఠ పోరులో ఓటమి
Captain Rana Roars! 🏏🔥
Nitish Rana dominates with a century to guide his team to victory! 💥
Nitish Rana| West Delhi Lions | South Delhi Superstarz | #DPL #DPL2025 #AdaniDPL2025 #Delhi pic.twitter.com/WcDy5Q1GM4— Delhi Premier League T20 (@DelhiPLT20) August 29, 2025