ఫిట్‌గా ఉన్నాడా?.. అవును.. అయితే, ఎందుకు తప్పించుకుంటున్నాడు? | Is He Even Fit: Raina Aakash Chopra Over MS Dhoni Future Turns Into Argument | Sakshi
Sakshi News home page

ఇంకా ఫిట్‌గా ఉన్నాడా?.. అవును.. అయితే, ఎందుకు ఆడట్లేదు?

May 26 2025 12:08 PM | Updated on May 26 2025 12:19 PM

Is He Even Fit: Raina Aakash Chopra Over MS Dhoni Future Turns Into Argument

Photo Courtesy: BCCI/IPL

మహేంద్ర సింగ్‌ ధోని (MS Dhoni).. ఐపీఎల్‌ ఆరంభ సీజన్‌ (2008) నుంచి ఆడుతున్న తలా.. ఇప్పటికీ క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో కొనసాగుతున్నాడు. కెప్టెన్‌గా చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK)కు ఐదుసార్లు టైటిల్‌ అందించిన ఈ దిగ్గజ సారథి.. 43 ఏళ్ల వయసులో మరోసారి పగ్గాలు చేపట్టాడు. 

ఇక ఐపీఎల్‌-2025 (IPL 2025)లో ఐదు మ్యాచ్‌లు ముగిసిన తర్వాత రుతురాజ్‌ గైక్వాడ్‌ గాయం వల్ల దూరం కాగా.. తలా మరోసారి సారథ్య బాధ్యతలు స్వీకరించాడు. అయితే, ఈసారి సీఎస్‌కే చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పాయింట్ల పట్టికలో తొలిసారి అట్టడుగున (పద్నాలుగు నాలుగే విజయాలు) పదో స్థానంలో నిలిచింది. 

అయితే, లీగ్‌ దశలో ఆఖరిదైన ఆదివారం నాటి మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌పై ఘన విజయం సాధించి సీజన్‌ను ముగించడం చెన్నై అభిమానులకు కాస్త ఊరటనిచ్చింది.

 

ఇక ఈ మ్యాచ్‌ ముందు నుంచే మరోసారి 43 ధోని రిటైర్మెంట్‌పై చర్చోపర్చలు జరిగాయి. ఇందులో భాగంగా మాజీ క్రికెటర్లు సురేశ్‌ రైనా, ఆర్పీ సింగ్‌- ఆకాశ్‌ చోప్రా, సంజయ్‌ బంగర్‌ మధ్య వాడివేడి చర్చ జరిగింది.

స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో భాగంగా ఈ కామెంటేటర్లు ధోని భవితవ్యంపై సంభాషణ సాగించారు. రైనా, ఆర్పీ సింగ్‌ తలా ఇంకొన్నాళ్లు కొనసాగాలని పేర్కొంటే.. ఆకాశ్‌ చోప్రా, సంజయ్‌ బంగర్‌ మాత్రం ధోని లోయర్‌ ఆర్డర్‌లో రావడాన్ని తప్పు బడుతూ ఇక అతడు తప్పుకోవాల్సిన సమయం వచ్చిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారి చర్చ సాగిందిలా..

ఆకాశ్‌ చోప్రా: ఒకవేళ ఎంఎస్‌ ధోని ‘అన్‌క్యాప్డ్‌’ (ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ నుంచి రిటైన్‌ అయిన తర్వాత ఇలా ఐపీఎల్‌లో అందుబాటులో ఉండవచ్చు)ప్లేయర్‌ కాకపోయి ఉంటే.. ఈసారి కూడా సీఎస్‌కే జట్టుతో కొనసాగేవాడా?

సురేశ్‌ రైనా: కచ్చితంగా.. పద్దెమినదేళ్లుగా అతడు జట్టుతో ఉన్నాడు. ఇంకా ఫిట్‌గా ఉన్నాడు. ఇప్పటికీ అత్యధిక సిక్సర్ల వీరుల జాబితాలో కొనసాగుతున్నాడు.

ఆకాశ్‌ చోప్రా: మరి అతడు 7, 8, 9 స్థానాల్లో ఎందుకు బ్యాటింగ్‌కు వస్తున్నాడు. బ్యాటింగ్‌ పరంగా జట్టు చిక్కుల్లో పడిన వేళ.. కష్టాలు చుట్టుముట్టిన సమయంలోనూ టాపార్డర్‌లో ఆడవచ్చు కదా? అంతటి అనుభవం ఉన్న ఆటగాడు ఇలా ఎందుకు చేస్తున్నాడు? అసలు అతడు నిజంగానే ఫిట్‌గా ఉన్నాడా?

సురేశ్‌ రైనా: ఆఖరి నాలుగు ఓవర్లలో ఆడటం ఎంఎస్‌కు సౌకర్యవంతంగా ఉంటుంది. అతడు ఫిట్‌గానే ఉన్నాడు. 44 ఏళ్లకు చేరువైనా.. ఇంకా వికెట్‌ కీపర్‌గా సేవలు అందిస్తున్నాడు. ఇన్నింగ్స్‌ బ్రేక్‌ సమయంలో ఇంటర్వ్యూలో రానున్న టీ20 ప్రపంచకప్‌ జట్టు గురించి మాట్లాడాడు. శివం దూబే వంటి వాళ్లకు అవకాశాలు ఇచ్చేందుకు తనిలా చేస్తుండవచ్చు కదా!

ఆర్పీ సింగ్‌: మోకాలి సర్జరీ తర్వాత ధోని కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. 20 ఏళ్లుగా కీపింగ్‌ చేస్తున్నాడు. కచ్చితంగా బ్యాటర్‌గానూ మరోసారి సత్తా చాటగలడు.

ఇదిలా ఉంటే.. గుజరాత్‌ టైటాన్స్‌పై 83 పరుగుల తేడాతో గెలుపొందిన తర్వాత ధోని మాట్లాడుతూ.. తన రిటైర్మెంట్‌ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. తన ఆట ముగిసిపోయిందని చెప్పలేనని.. అదే విధంగా ఎప్పుడు తిరిగి వస్తానో తెలియదని పేర్కొన్నాడు. రిటైర్మెంట్‌ విషయంలో నిర్ణయానికి ఇంకా సమయం ఉందని ధోని తెలిపాడు. కాగా ఈ సీజన్‌లో ధోని 14 మ్యాచ్‌లలో కలిపి 196 పరుగులు మాత్రమే చేశాడు.

చదవండి: Pat Cummins: ఫైనల్‌ చేరాల్సిన జట్టు.. మా వాళ్లను చూస్తే నాకే భయమేసింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement