బెంగళూరు తొక్కిసలాట.. ఏ సమయంలో ఏం జరిగిందంటే..? | How the RCB IPL 2025 Victory Parade in Bengaluru Led to a Stampede: A Timeline of Events | Sakshi
Sakshi News home page

Bengaluru Stampade: ఘోరం జరిగిందిలా..!

Jun 4 2025 7:37 PM | Updated on Jun 4 2025 9:13 PM

RCB Victory Parade Stampede Updates

బెంగళూరులో జరిగిన ఆర్సీబీ విజయోత్సవంలో పెను విషాదం చోటు చేసుకుంది. ఆటగాళ్ల సన్మాన కార్యక్రమం జరిగిన చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరగడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. ఇంకా పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. మృతుల్లో నలుగురు మహిళలు, ఓ బాలుడు ఉన్నట్లు సమాచారం. స్టేడియంలోకి ఒక్కసారిగా భారీ సంఖ్యలో అభిమానులు దూసుకురావడంతో ఈ ప్రమాదం​ సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. 

స్టేడియం గేట్‌ దగ్గర ఉన్న పైకప్పు కూలడంతో తొక్కిసలాట ప్రారంభమైందని తెలుస్తుంది. ఒక్కసారిగా ఫ్యాన్స్‌ స్టేడియంలోకి దూసుకురావడంతో పోలీసులు అదుపు చేయలేకపోయారు. ఈ క్రమంలో లాఠీచార్జ్‌ జరిగింది. స్టేడియం ఖాళీ చేయాలని అభిమానులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. గాయపడిన వారికి బౌరింగ్‌ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బౌరింగ్‌ ఆసుపత్రిలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య బాధితులను పరామర్శించారు.

తొక్కిసలాట దురదృష్టకరమని కర్ణాటక డిప్యూటీ సీఎం అన్నారు. అభిమానులను అదుపు చేయలేకపోయామని ఆయన తెలిపారు. మృతుల కుటుంబాలకు డీకే క్షమాపణ చెప్పారు.

ఘోరం​ జరిగిందిలా..

మధ్యాహ్నం 3 గంటల 49 నిమిషాలకు ఆర్సీబీ టీమ్‌ బెంగళూరుకు చేరింది

4:47 విధాన సభ ప్రాంగణానికి ఆర్సీబీ టీమ్‌

5:10కి భారీ వర్షంలోనే ఆర్సీబీ టీమ్‌కు సత్కారం

5:16 చిన్నస్వామి స్టేడియం దగ్గర లాఠీచార్జ్‌

5:16 భారీ కేడ్లు దూకిన ఫ్యాన్స్‌, తొక్కిసలాట

5:30 ఘటనపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఆరా

5:47 స్టేడియం వద్దకు చేరుకున్న ఆంబులెన్స్‌

5:50 ఎనిమిది మంది చనిపోయినట్లు ప్రకటన

5:53 చేతులెత్తేసిన పోలీసులు

6:01 పది మంది చనిపోయినట్లు ప్రకటన

 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement