తిరుపతిలో రైలు ప్రమాదం జరిగింది. హిస్సార్ టూ తిరుపతి (04717) ట్రైన్‌లో మంటలు చెలరేగాయి.
మంటల తీవ్రతతో రెండు బోగీలు దగ్ధమయ్యాయి.
మంటలు మరో ట్రైన్ భోగీకి వ్యాపించాయి.
రైలు అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు.
అగ్నిప్రమాపక సిబ్బంది ఎగిసి పడుతున్న మంటల్ని అదుపు చేశారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగా రైలులో అగ్నిప్రమాదం సంభవించిందని రైల్వే అధికారులు వెల్లడించారు.


