
ఐపీఎల్-2025లో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ అద్బుత సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన క్లాసెన్ విధ్వంసం సృష్టించాడు. ఈ దక్షిణాఫ్రికా ఆటగాడు ప్రత్యర్ధి బౌలర్లను ఊతికారేశాడు. అరుణ్ జైట్లీ స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించాడు.
అతడి బ్యాటింగ్ ధాటికి ఫీల్డర్లు కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే పోషించారు. ఈ క్రమంలో క్లాసెన్ కేవలం 37 బంతుల్లోనే తన రెండో ఐపీఎల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. క్లాసెన్ ఓవరాల్‌గా 39 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్‌లతో 105 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. దీంతో టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
క్లాసెన్‌తో పాటు ట్రావిస్ హెడ్(40 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 76), అభిషేక్ శర్మ(16 బంతుల్లో 32), ఇషాన్(29) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ రెండు, వైభవ్ ఆరోరా ఓ వికెట్ సాధించారు. కాగా ఇది ఐపీఎల్‌లో మూడో అత్యధిక స్కోర్ కావడం విశేషం. ఐపీఎల్‌లో అత్యధిక టోటల్ నమోదు చేసిన రికార్డు కూడా ఎస్ఆర్‌హెచ్ పేరిటే ఉంది. ఐపీఎల్-2024లో బెంగళూరుపై సన్‌రైజర్స్ 3 వికెట్ల నష్టానికి ఏకంగా 287 పరుగులు చేసింది.
HEINRICH KLAASEN - Fastest Century by an SRH player 🔥🫡 #SRHvKKR
pic.twitter.com/glWohcuB4x— Arun Vijay (@AVinthehousee) May 25, 2025