
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025 సీజన్ తమ ఆఖరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 110 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.
క్లాసెన్ 39 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్‌లతో 105 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. క్లాసెన్‌తో పాటు ట్రావిస్ హెడ్(40 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 76), అభిషేక్ శర్మ(16 బంతుల్లో 32), ఇషాన్(29) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ రెండు, వైభవ్ ఆరోరా ఓ వికెట్ సాధించారు.
అనంతరం లక్ష్య చేధనలో కేకేఆర్ 18.4 ఓవర్లలో 168 పరుగులకే ఆలౌటైంది. కేకేఆర్ బ్యాటర్లలో మనీశ్ పాండే(37) టాప్ స్కోరర్‌గా నిలవగా.. హర్షిత్ రాణా(34), సునీల్ నరైన్(31) పర్వాలేదన్పించారు. మిగితా కేకేఆర్ బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఎస్ఆర్‌హెచ్ బౌలర్లలో జయ్‌దేవ్ ఉనద్కట్, మలింగ మూడు వికెట్లు పడగొట్టగా.. హర్ష్‌దూబే తలా రెండు వికెట్లు సాధించారు.