
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 21) జరిగిన కీలక మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్ 59 పరుగల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ 18.2 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో ముంబై ప్లే ఆఫ్స్‌కు చేరగా.. ఢిల్లీ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.
ఏడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ
14.5వ ఓవర్- ఢిల్లీ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయింది. సాంట్నర్ బౌలింగ్‌లో అశుతోష్ శర్మ (18) స్టంపౌటయ్యాడు.
ఆరో వికెట్ కోల్పోయిన ఢిల్లీ
14.2వ ఓవర్- 103 పరుగుల వద్ద ఢిల్లీ ఆరో వికెట్ కోల్పోయింది. సాంట్నర్ బౌలింగ్‌లో సమీర్ రిజ్వి (39) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
పీకల్లోతు కష్టాల్లో ఢిల్లీ
181 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆ జట్టు 65 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతుంది. 9.2వ ఓవర్‌లో బుమ్రా బౌలింగ్‌లో ట్రిస్టన్ స్టబ్స్ (2) ఔటయ్యాడు.
నాలుగో వికెట్ కోల్పోయిన ఢిల్లీ
7.6వ ఓవర్- 55 పరుగుల వద్ద ఢిల్లీ నాలుగో వికెట్ కోల్పోయింది. సాంట్నర్ బౌలింగ్‌లో విప్రాజ్ (20) కాట్ అండ్ బౌల్డ్ అయ్యాడు.
27 పరుగలకే 3 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ
4.2వ ఓవర్- 181 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ 27 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. జాక్స్ బౌలింగ్‌లో రికెల్టన్ అద్బుతమైన స్టంపింగ్ చేయడంతో అభిషేక్ పోరెల్ (6) ఔటయ్యాడు.
టార్గెట్ 181.. 20 పరుగులకే రెండో వికెట్లు కోల్పోయిన ఢిల్లీ
2.4వ ఓవర్- 20 పరుగుల వద్ద ఢిల్లీ రెండో వికెట్ కోల్పోయింది. బౌల్ట్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ రికెల్టన్ క్యాచ్ పట్టడంతో కేఎల్ రాహుల్ (11) ఔటయ్యాడు.
టార్గెట్ 181.. తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ
1.4వ ఓవర్- 181 పరుగల లక్ష్య ఛేదనలో ఢిల్లీ 12 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. దీపక్ చాహర్ బౌలింగ్‌లో సాంట్నర్‌కు క్యాచ్ ఇచ్చి డుప్లెసిస్ (6) ఔటయ్యాడు.
స్కై, నమన్ ధిర్ కొసమెరుపు.. ఫైటింగ్ టార్గెట్‌ను సెట్ చేసిన ముంబై
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 18 ఓవర్లు పరుగులు సాధించేందుకు ఇబ్బంది పడినప్పటికీ.. ఆఖరి రెండు ఓవర్లలో జూలు విదిల్చింది.
ఈ రెండు ఓవర్లలో సూర్యకుమార్ యాదవ్ (43 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), నమన్ ధిర్ (8 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఆఖరి రెండు ఓవర్లలో నమన్ ధిర్, సై 48 పరుగులు పిండుకున్నారు.
ఐదో వికెట్ కోల్పోయిన ముంబై
16.3వ ఓవర్- 123 పరుగుల వద్ద ముంబై ఐదో వికెట్ కోల్పోయింది. చమీరా బౌలింగ్‌లో ముకేశ్ కుమార్‌కు క్యాచ్ ఇచ్చి హార్దిక్ పాండ్యా (3) ఔటయ్యాడు.
నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై
14.5వ ఓవర్- 113 పరుగుల వద్ద ముంబై నాలుగో వికెట్ కోల్పోయింది. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో సమీర్ రిజ్వికి క్యాచ్ ఇచ్చి తిలక్ వర్మ (27) ఔటయ్యాడు.
12 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 95/3
12 ఓవర్ల తర్వాత ముంబై ఇండియన్స్ స్కోర్ 95/3గా ఉంది. తిలక్ వర్మ (23), సూర్యకుమార్ యాదవ్ (19) క్రీజ్‌లో ఉన్నారు.
మూడో వికెట్ కోల్పోయిన ముంబై
6.4వ ఓవర్- 58 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో మాధవ్ తివారి క్యాచ్ పట్టడంతో రికెల్టన్ (25) ఔటయ్యాడు.
రెండో వికెట్ కోల్పోయిన ముంబై
5.3వ ఓవర్- 48 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో విప్రాజ్ నిగమ్‌కు క్యాచ్ ఇచ్చి విల్ జాక్స్ (21) ఔటయ్యాడు.
5 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 46/1
5 ఓవర్ల తర్వాత ముంబై ఇండియన్స్ స్కోర్ 46/1గా ఉంది. విల్ జాక్స్ 20, రికెల్టన్ 21 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన ముంబై.. రోహిత్ ఔట్
2.2వ ఓవర్- 23 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ (5) ఔటయ్యాడు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 21) జరుగుతున్న అత్యంత కీలకమైన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు ఢిల్లీ రెగ్యులర్ కెప్టెన్ అక్షర్ పటేల్ దూరమయ్యాడు. అతని స్థానంలో డుప్లెసిస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండడని భావించిన కేఎల్ రాహుల్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగనున్నాడు.
ముంబై విషయానికొస్తే.. ఈ జట్టు ఓ మార్పుతో బరిలోకి దిగుతుంది. కార్బిన్ బాష్ స్థానంలో మిచెల్ సాంట్నర్ తుది జట్టులోకి వచ్చాడు. మిగిలిన ఏకైక ప్లే ఆఫ్స్ నేపథ్యంలో ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం. ఈ సీజన్‌లో గుజరాత్, ఆర్సీబీ, పంజాబ్ ఇదివరకే ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి.
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(w), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా
ఇంపాక్ట్ సబ్స్: కర్ణ్ శర్మ, కార్బిన్ బాష్, రాజ్ బావా, అశ్వనీ కుమార్, సత్యనారాయణ రాజు
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): ఫాఫ్ డు ప్లెసిస్(సి), అభిషేక్ పోరెల్(w), సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, ట్రిస్టన్ స్టబ్స్, దుష్మంత చమీరా, విప్రజ్ నిగమ్, మాధవ్ తివారీ, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్, ముఖేష్ కుమార్
ఇంపాక్ట్ సబ్స్: KL రాహుల్, సెడిఖుల్లా అటల్, కరుణ్ నాయర్, త్రిపురాన విజయ్, మన్వంత్ కుమార్