రోహిత్ శర్మకు ఘోర అవమానం!.. అందుకే రిటైర్మెంట్ ప్రకటించాడా? | Rohit Sharma wanted to play against England and retire mid-series: Reports | Sakshi
Sakshi News home page

IPL 2025: రోహిత్ శర్మకు ఘోర అవమానం!.. అందుకే రిటైర్మెంట్ ప్రకటించాడా?

May 20 2025 8:47 PM | Updated on May 20 2025 9:55 PM

Rohit Sharma wanted to play against England and retire mid-series: Reports

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆకస్మికంగా టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అయితే రోహిత్ శర్మ అనూహ్య రిటైర్మెంట్‌పై పలు ఊహాగానాలు వినిపించాయి. ఇంగ్లండ్‌తో టెస్టుల‌కు ముందు భారత టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్‌ తొలగించాలని  బీసీసీఐ సెలక్షన్ కమిటీ నిర్ణ‌యం తీసుకుందని, అందుకే అతడు రిటైర్మెంట్ ప్రకటించాడని ప్రచారం జరిగింది. 

తాజాగా రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై ప్రముఖ క్రీడా వెబ్‌సైట్  స్కై స్పోర్ట్స్ సంచలన రిపోర్ట్‌ను వెల్లడించింది. ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు కెప్టెన్‌గా తనను ఎంపిక చేయాలని, టూర్ మధ్యలో రిటైర్మెంట్ ప్రకటిస్తానని బీసీసీఐకి హిట్‌మ్యాన్ తెలియజేసినట్లు  తమ రిపోర్ట్‌లో పేర్కొంది. కానీ బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాత్రం రోహిత్‌ను కేవలం ఆటగాడిగా మాత్రమే ఎంపిక చేస్తామని, కెప్టెన్‌గా వేరే ప్లేయర్‌కు అవకాశమిస్తామని చెప్పినట్లు సదరు వెబ్‌సైట్ తమ నివేదికలో వెల్లడించింది. 

ఈ క్రమంలోనే రోహిత్ శర్మ తన రెడ్ బాల్ కెరీర్‌ను ముగించాలని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. కాగా రోహిత్ శ‌ర్మ రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన వారం రోజులో స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లి సైతం టెస్టుల‌కు వీడ్కోలు ప‌లికాడు. ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌కు ముందు భార‌త జ‌ట్టుకు కొత్త టెస్టు కెప్టెన్ రానున్నాడు.

కెప్టెన్సీ రేసులో శుబ్‌మ‌న్ గిల్ ముందుంజ‌లో ఉన్నాడు. ఇక రోహిత్ తన టెస్ట్ కెరీర్‌లో 67 మ్యాచ్‌లు ఆడి 40.57 సగటుతో 4,301 పరుగులు సాధించారు. ఇందులో 12 సెంచరీలు ఉన్నాయి. 2019లో దక్షిణాఫ్రికాపై సాధించిన 212 పరుగులు అత్యధిక వ్యక్తిగత స్కోరు. కెప్టెన్‌గా 24 టెస్టులకు నాయకత్వం వహించి, 12 విజయాలు, 9 ఓటములు, 3 డ్రాలు నమోదు చేశాడు.
చదవండి: ఐపీఎల్‌-2025 ఫ్లే ఆఫ్స్ వేదికలు ఖరారు.. ఫైనల్ ఎక్కడంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement