వైజాగ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో టీమిండియా ఓటమి పాలైనప్పటికి.. ఆల్‌రౌండర్ శివమ్ దూబే మాత్రం తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 216 పరుగుల భారీ లక్ష్య చేధనలో భారత జట్టుకు ఆరంభం నుంచే కష్టాలు ఎదురయ్యాయి. మెన్ ఇన్ బ్లూ 60 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఓవైపు క్రమం తప్పుకొండా వికెట్లు పడుతున్నప్పటికి ఈ ముంబై స్టార్ మాత్రం తన విధ్వంసకర బ్యాటింగ్‌ను కొనసాగించాడు. భారత ఇన్నింగ్స్ 12వ ఓవర్ వేసిన స్పిన్నర్ ఇష్ సోధీకి దూబే చుక్కలు చూపించాడు.
ఆ ఓవర్‌లో దూబే ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు. తొలి బంతికి రెండు పరుగులు తీసిన దూబే.. ఆ తర్వాత వరుసగా 4,6,4,6,6 బాదాడు. ఈ క్రమంలో ఒకే అత్యధిక పరుగులు సాధించిన మూడో భారత బ్యాటర్‌గా రోహిత్ శర్మ రికార్డును దూబే సమం చేశాడు. ఈ జాబితాలో యువరాజ్ సింగ్(36), సంజూ శాంసన్(30) తొలి రెండు స్ధానాల్లో ఉన్నాడు.
అయితే ఓ దశలో మ్యాచ్‌ను గెలిపించేలా కన్పించిన దూబే.. దురదృష్టవశాత్తు రనౌట్‌గా వెనుదిరిగాడు. మొత్తంగా కేవలం 23 బంతుల్లో మాత్రమే ఎదుర్కొన్న దూబే 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 65 పరుగులు చేశాడు. దూబేతో పాటు రింకూ సింగ్(39) రాణించాడు. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ ఇప్పటికే 3-1 తేడాతో సొంతం చేసుకుంది.
कल शिवम दुबे ने 15 गेंदों पर फिफ्टी पीट दिया।
घोड़े के पैर में जंजीर नहीं बाधेंगे तो वो इतिहास ही रचेगा।
pic.twitter.com/6f80FCvmlJ— Shubham Shukla (@Shubhamshuklamp) January 29, 2026


