
పంజాబ్‌పై 6 వికెట్లతో జయభేరి
మెరిపించిన కరుణ్
గెలిపించిన రిజ్వీ
జైపూర్: ఈ ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్ చెరిన జట్లను ఇంటికెళ్లే జట్లు గట్టి దెబ్బే కొడుతున్నాయి. తాజాగా పట్టికలో ‘టాప్’పై గురిపెట్టిన పంజాబ్ కింగ్స్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్లతో గెలిచి షాకిచ్చింది. తద్వారా ఢిల్లీ ఘన విజయంతో ఈ సీజన్‌ను ముగించింది. తొలుత పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోరు చేసింది. కెపె్టన్ శ్రేయస్ అయ్యర్ (34 బంతుల్లో 53; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు.
ఆరంభంలో ఇన్‌గ్లిస్ (12 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆఖర్లో స్టొయినిస్ (16 బంతుల్లో 44 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) దంచేశారు. అనంతరం ఢిల్లీ 19.3 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 208 పరుగులు చేసి గెలిచింది. కరుణ్ నాయర్ (27 బంతుల్లో 44; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), మెరిపిస్తే... సమీర్ రిజ్వీ (25 బంతుల్లో 58 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) గెలిచేదాకా నిలిచాడు.
స్కోరు వివరాలు
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ఆర్య (సి) స్టబ్స్ (బి) ముస్తాఫిజుర్ 6; ప్రభ్‌సిమ్రన్ (బి) విప్రాజ్ 28; ఇన్‌గ్లిస్ (స్టంప్డ్) స్టబ్స్ (బి) విప్రాజ్ 32; శ్రేయస్ (సి) మోహిత్ (బి) కుల్దీప్ 53; నేహల్ (సి) డుప్లెసిస్ (బి) ముకేశ్ 16; శశాంక్ (సి) స్టబ్స్ (బి) ముస్తాఫిజుర్ 11; స్టొయినిస్ నాటౌట్ 44; అజ్మతుల్లా (సి) సమీర్ (బి) కుల్దీప్ 1; యాన్సెన్ (సి) స్టబ్స్ (బి) ముస్తాఫిజుర్ 0; హర్‌ప్రీత్ నాటౌట్ 7; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 206. వికెట్ల పతనం: 1–8, 2–55, 3–77, 4–118, 5–144, 6–172, 7–174, 8–197. బౌలింగ్: ముకేశ్ 4–0–49–1, ముస్తాఫిజుర్ 4–0–33–3, మోహిత్ శర్మ 4–0–47–0, విప్రాజ్ నిగమ్ 4–0–38–2, కుల్దీప్ 4–0–39–2.
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) శశాంక్ (బి) యాన్సెన్ 35; డుప్లెసిస్ (సి) ప్రియాన్ష్(బి) హర్‌ప్రీత్ 23; కరుణ్ (బి) హర్‌ప్రీత్ 44; సాదికుల్లా (సి) అర్‡్షదీప్ (బి) ప్రవీణ్ 22; రిజ్వీ నాటౌట్ 58; స్టబ్స్ నాటౌట్ 18; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (19.3 ఓవర్లలో 4 వికెట్లకు) 208. వికెట్ల పతనం: 1–55, 2–65, 3–93, 4–155. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–35–0, అజ్మతుల్లా 4–0–46–0, హర్‌ప్రీత్ 4–0–41–2, యాన్సెన్ 4–0–41–1, ప్రవీణ్ 2–0–20–1, స్టొయినిస్ 1.3–0–21–0.
ఐపీఎల్‌లో నేడు
గుజరాత్ X చెన్నై
వేదిక: అహ్మదాబాద్
మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి
కోల్‌కతా X హైదరాబాద్
వేదిక: ఢిల్లీ
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం