కుల్దీప్ పెళ్లి సందడి.. డ్యాన్స్‌ చేసిన చాహల్‌! వీడియో | Yuzvendra Chahal Lights Up Kuldeep Yadav's Haldi Ceremony | Sakshi
Sakshi News home page

కుల్దీప్ పెళ్లి సందడి.. డ్యాన్స్‌ చేసిన చాహల్‌! వీడియో

Mar 14 2026 11:52 AM | Updated on Mar 14 2026 11:59 AM

Yuzvendra Chahal Lights Up Kuldeep Yadav's Haldi Ceremony

టీమిండియా స్టార్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ పెళ్లి వేడుక‌లు ఉత్త‌రాఖాండ్‌లోని ముస్సోరీలో ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. కుల్దీప్ తన చిన్ననాటి స్నేహితురాలు వంశికతో కలిసి ఈరోజు వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. అయితే శుక్ర‌వారం జ‌రిగిన హాల్దీ వేడుక‌లో కుల్దీప్ స్నేహితుడు, భారత స్పిన్న‌ర్ య‌జ్వేంద్ర చాహ‌ల్ సంద‌డి చేశాడు.

'ఓ రోమియో' సినిమాలోని "పాన్ కీ దుకాన్" పాటకు చాహల్ డ్యాన్స్ వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అంతేకాకుండా కుల్దీప్, వంశికలకు స్వయంగా పసుపు (హల్దీ) పూసి చాహల్ తన స్నేహాన్ని చాటుకున్నాడు.

చాహల్‌తో పాటు క్రికెటర్లు రింకూ సింగ్‌, పియూష్ చావ్లా, భారత ఫీల్డింగ్ కోచ్ టి దిలిప్ ఇప్పటికే ముస్సోరీకి చేరుకున్నారు. అదేవిధంగా ఈ వివాహ వేడుకకు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా వంటి స్టార్ క్రికెటర్లతో పాటు బీసీసీఐ అధికారులు హాజరయ్యే అవకాశం ఉంది. కాగా కుల్దీప్ పెళ్లి గతేడాది డిసెంబర్‌లోనే జరగాల్సిండేది. కానీ టీ20 ప్రపంచకప్‌-2026 దృష్ట్యా కుల్దీప్ తన వివాహాన్ని వాయిదా వేసుకున్నాడు.


 

 

Advertisement
 
Advertisement
Advertisement