
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 26) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. ఈ గెలుపుతో పంజాబ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకి, టాప్-2లో స్థానాన్ని ఖరారు చేసుకోగా.. ముంబై నాలుగో స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేయగా.. పంజాబ్ 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ప్రియాంశ్ ఆర్య 62, జోష్ ఇంగ్లిస్ 73, శ్రేయస్ అయ్యర్ 26 (నాటౌట్) పరుగులు చేసి పంజాబ్‌ను విజయతీరాలకు చేర్చారు.
రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్
14.1వ ఓవర్- 143 పరుగుల వద్ద పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. సాంట్నర్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి ప్రియాంశ్ ఆర్య (62) ఔటయ్యాడు.
టార్గెట్ 185.. 13 ఓవర్ల తర్వాత పంజాబ్ స్కోర్ 131/1
ప్రియాంశ్ ఆర్య 57, జోష్ ఇంగ్లిస్ 54
టార్గెట్ 185.. 10 ఓవర్ల తర్వాత పంజాబ్ స్కోర్ 89/1
ప్రియాంశ్ ఆర్య 37, జోష్ ఇంగ్లిస్ 35
8 ఓవర్ల తర్వాత పంజాబ్ స్కోర్ 75/1
ఇంగ్లిస్ 25, ప్రియాంశ్ ఆర్య 34
టార్గెట్ 185.. తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్
4.2వ ఓవర్- 185 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ 34 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో అశ్వనీ కుమార్‌కు క్యాచ్ ఇచ్చి ప్రభ్‌సిమ్రన్ సింగ్ (13) ఔటయ్యాడు.
సత్తా చాటిన సూర్యకుమార్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే..?
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన సూర్యకుమార్ మెరుపు అర్ద సెంచరీతో (57) సత్తా చాటాడు.
ముంబై ఇన్నింగ్స్‌లో రికెల్టన్ 27, రోహిత్ శర్మ 24, తిలక్ వర్మ 1, విల్ జాక్స్ 17, హార్దిక్ పాండ్యా 26, నమన్ ధిర్ 20 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో జన్సెన్, విజయ్‌కుమార్ వైశాఖ్, అర్షదీప్ సింగ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. హర్ప్రీత్ బ్రార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
ఆఖరి ఓవర్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన అర్షదీప్ కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు (నమన్ ధిర్, సూర్యకుమార్ యాదవ్) తీశాడు.
18 ఓవర్ల తర్వాత ముంబై ఇండియన్స్ స్కోర్ 158/5
సూర్యకుమార్ యాదవ్ 45, నమన్ ధిర్ 7 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై
12.3వ ఓవర్- 106 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. విజయ్ కుమార్ బౌలింగ్‌లో జన్సెన్‌కు క్యాచ్ ఇచ్చి విల్ జాక్స్ (17) ఔటయ్యాడు.
మూడో వికెట్ కోల్పోయిన ముంబై
10.5వ ఓవర్- 87 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. విజయ్ కుమార్ బౌలింగ్‌లో అర్షదీప్‌కు క్యాచ్ ఇచ్చి తిలక్ వర్మ (1) ఔటయ్యాడు.
రెండో వికెట్ కోల్పోయిన ముంబై
9.3వ ఓవర్- 81 పరుగుల వద్ద ముంబై రెండో వికెట్ కోల్పోయింది. హర్ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో నేహల్ వధేరాకు క్యాచ్ ఇచ్చి రోహిత్ శర్మ (24) ఔటయ్యాడు.
9 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 79/1
9 ఓవర్ల తర్వాత ముంబై ఇండియన్స్ స్కోర్ 79/1గా ఉంది. రోహిత్ శర్మ 23, సూర్యకుమార్ యాదవ్ 26 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన ముంబై
5.1వ ఓవర్- 45 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది.జన్సెన్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి రికెల్టన్ (27) ఔటయ్యాడు.
5 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 50/0
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ ధాటిగా ఆడుతుంది. 5 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 45/0గా ఉంది. రికెల్టన్ 27, రోహిత్ శర్మ 16 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్
ఐపీఎల్ 2025లో భాగంగా జైపూర్ వేదికగా ఇవాళ (మే 26) జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
తుది జట్లు..
పంజాబ్ కింగ్స్: ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్, శ్రేయాస్ అయ్యర్, నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, కైల్ జేమీసన్, విజయ్‌కుమార్ వైశాక్
ఇంపాక్ట్ సబ్స్: ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రవీణ్ దూబే, సూర్యాంశ్ షేడ్గే, జేవియర్ బార్ట్‌లెట్, ముషీర్ ఖాన్
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ర్యాన్ రికిల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా
ఇంపాక్ట్ సబ్స్: కర్ణ్ శర్మ, కార్బిన్ బాష్, రాజ్ బవా, అశ్వనీ కుమార్, సత్యనారాయణ రాజు