
ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ ప్రయాణం ముగిసింది. శుక్రవారం ముల్లాన్‌పూర్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌లో 20 పరుగుల తేడాతో ఓటమి పాలైన గుజరాత్.. ఈ టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది. 229 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడంలో గుజరాత్ విఫలమైంది.
సాయిసుదర్శన్(81), వాషింగ్టన్ సుందర్(48) అద్బుత ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ మిగితా బ్యాటర్లు తేలిపోవడంతో గుజరాత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. లక్ష్య చేధనలో టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పయి 208 పరుగులు చేయగల్గింది. ఇక ఈ హార్ట్‌బ్రేకింగ్ ఓటమిపై మ్యాచ్ అనంతరం గుజరాత్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ స్పందించాడు. తమ పేలవ ఫీల్డింగ్ కారణంగానే ఓడిపోయాము అని గిల్ తెలిపాడు.
"క్రికెట్ అనేది నిజంగా ఒక అద్బుతమైన గేమ్. ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఈ మ్యాచ్‌లో మేము ఆఖరి వరకు పోరాడి ఓడిపోయాము. చివరి మూడు, నాలుగు ఓవర్లలో మాకు కలిసి రాలేదు. అయినప్పటికి మేము బాగానే ఆడాము. కచ్చితంగా క్యాచ్‌లు మ్యాచ్ ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి.
ఈ మ్యాచ్‌లో మేము మూడు సునాయస క్యాచ్‌లు జారవిడిచాము. ఈజీగా క్యాచ్‌లను వదిలిస్తే బౌలర్లకు పరుగులను నియంత్రించడం అంత సులభం కాదు. సాయిసుదర్శన్, వాషింగ్టన్ సుందర్‌కు మేము ఒకటే మెసేజ్ పంపాము. ఎలాంటి ఒత్తిడి లేకుండా పూర్తిగా స్వేచ్ఛగా ఆడాలని వారికి చెప్పాం. జట్టును గెలిపించడమే వారద్దరి లక్ష్యం.
మంచు కారణంగా వికెట్ కూడా బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది. ఈ సీజన్‌లో మాకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. గత మూడు మ్యాచ్‌లలో మేము స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాము. కానీ జట్టులోని ప్రతీ ఒక్కరూ కూడా మెరుగ్గా రాణించారు. ముఖ్యంగా సాయిసుదర్శన్ ఒక అద్బుం. ఈ సీజన్‌లో అతడు ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో గిల్ పేర్కొన్నాడు.
చదవండి: సంతోషంగా ఉంది.. అతడి వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాము: హార్దిక్