భారత్‌తో టెస్ట్ సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు ప్రకటన | New Zealand Announce Squad For Tests vs India | Sakshi
Sakshi News home page

భారత్‌తో టెస్ట్ సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు ప్రకటన

Nov 11 2026 8:24 AM | Updated on Nov 11 2026 8:24 AM

New Zealand Announce Squad For Tests vs India

source: X

స్వదేశంలో భారత్‌తో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ కోసం న్యూజిలాండ్‌ జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా టామ్‌ లాథమ్‌ వ్యవహరించనున్నాడు. చీలమండ గాయం కారణంగా బెన్ సియర్స్, తుంటి గాయంతో జాక్ ఫౌల్క్స్, రిటర్న్ టు ప్లే కార్యక్రమంలో ఉన్న విల్ ఓ రూర్కే జట్టుకు దూరమయ్యారు. వీరి స్థానంలో జాకబ్ డఫీ జట్టులోకి వచ్చాడు.

మరోవైపు టామ్ బ్లండెల్, డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర గాయాలతో బాధపడుతున్నా, తొలి టెస్ట్‌ సమయానికంతా కోలుకుంటారని జట్టులోకి ఎంపిక చేశారు. ఈ మార్పులు మినహా ఇంగ్లండ్‌ పర్యటనలో ఆడిన జట్టునే దాదాపుగా కొనసాగించారు.

2024లో భారత్‌పై 3-0తో చారిత్రాత్మక టెస్ట్ సిరీస్ విజయాన్ని నమోదు చేసిన న్యూజిలాండ్.. మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ నవంబర్‌ 19న ప్రారంభం కానుంది. తొలి టెస్ట్‌ వెల్లింగ్టన్‌ వేదికగా, రెండో టెస్ట్‌ క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా నవంబర్‌ 27న ప్రారంభం కానున్నాయి.

భారత్‌తో టెస్ట్ సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు:
టామ్ లాథమ్ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, మాట్ హెన్రీ, కైల్ జేమీసన్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్, విల్ యంగ్.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం భారత్‌-న్యూజిలాండ్ జట్లు వైట్‌బాల్ సిరీస్‌లలో తలపడుతున్నాయి. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 3-2తో కైవసం చేసుకోగా.. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ప్రస్తుతం భారత్‌ 2-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. తాజాగా మూడో వన్డే వర్షం​ కారణంగా రద్దు కాగా.. నాలుగో వన్డే మౌంట్‌ మాంగనూయ్‌ వేదికగా నవంబర్‌ 13న జరుగనుంది. 

ఇదీ చదవండి: గిల్ రికార్డును స‌మం చేసిన ఆర్య‌వీర్ సెహ్వాగ్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement