గుజరాత్‌కు షాకిచ్చిన లక్నో.. | IPL 2025: Gujarat Titans vs Lucknow Super Giants Live Updates | Sakshi
Sakshi News home page

IPL 2025: గుజరాత్‌కు షాకిచ్చిన లక్నో..

May 22 2025 7:02 PM | Updated on May 22 2025 11:50 PM

IPL 2025: Gujarat Titans vs Lucknow Super Giants Live Updates

PC: BCCI/IPL.com

IPL 2025 GT vs LSG Live Updates: ఐపీఎల్‌-2025లో అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ త‌ల‌ప‌డుతున్నాయి.
గుజరాత్‌కు షాకిచ్చిన లక్నో..
గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 33 ప‌రుగుల తేడాతో ల‌క్నో విజ‌యం సాధించింది. 236 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన గుజ‌రాత్.. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 202 ప‌రుగుల‌కు ప‌రిమితమైంది.టైటాన్స్ బ్యాట‌ర్ల‌లో షారుఖ్ ఖాన్(57) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. షెర్ఫ‌న్ రూథ‌ర్‌ఫ‌ర్డ్‌(38),బ‌ట్ల‌ర్‌(33), శుబ్‌మన్‌ గిల్‌(35) తమవంతు ప్రయత్నం చేశారు. లక్నో బౌలర్లలో విలియం ఓ రూర్క్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. బదోని రెండు, ఆకాష్‌ మహారాజ్‌ సింగ్‌,అవేష్‌ ఖాన్‌ తలా వికెట్‌ సాధించారు.
గుజరాత్ నాలుగో వికెట్ డౌన్‌..
రూథర్‌ఫర్డ్ రూపంలో గుజరాత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 38 పరుగులు చేసిన రూథర్‌ఫర్డ్‌.. ఓ రూర్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. గుజరాత్ విజయానికి 23 బంతుల్లో 54 పరుగులు కావాలి. క్రీజులో షారుఖ్ ఖాన్‌(49) ఉన్నాడు.

దూకుడు పెంచిన షారుఖ్‌, రూథ‌ర్‌ఫ‌ర్డ్‌
14 ఓవ‌ర్లు ముగిసే స‌రికి గుజ‌రాత్ టైటాన్స్ మూడు వికెట్ల న‌ష్టానికి 146 ప‌రుగులు చేసింది. క్రీజులో షారుఖ్ ఖాన్‌(27),రూథ‌ర్ ఫ‌ర్డ్‌(25) ఉన్నారు.

గుజ‌రాత్ మూడో వికెట్ డౌన్‌..
జోస్ బ‌ట్ల‌ర్ రూపంలో గుజ‌రాత్ మూడో వికెట్ కోల్పోయింది. 33 ప‌రుగులు చేసిన బ‌ట్ల‌ర్‌.. ఆకాష్ మ‌హారాజ్ సింగ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ‌య్యాడు. 11 ఓవ‌ర్లు ముగిసే స‌రికి గుజ‌రాత్ మూడు వికెట్ల న‌ష్టానికి 107 ప‌రుగులు చేసింది.

గుజ‌రాత్ రెండో వికెట్ డౌన్‌
శుబ్‌మ‌న్ గిల్ రూపంలో గుజ‌రాత్ టైటాన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 35 ప‌రుగులు చేసిన గిల్‌.. అవేష్ ఖాన్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 9 ఓవ‌ర్లు ముగిసే సరికి గుజ‌రాత్ రెండు వికెట్ల న‌ష్టానికి 94 ప‌రుగులు చేసింది.

గుజరాత్ తొలి వికెట్ డౌన్‌..
సాయిసుదర్శన్ రూపంలో గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన సాయిసుదర్శన్‌.. విలియం ఓ రూర్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు గుజరాత్ వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. క్రీజులో శుబ్‌మన్ గిల్‌(24), జోప్ బట్లర్‌(20) ఉన్నారు.

దూకుడుగా ఆడుతున్న గుజ‌రాత్‌..
33 ఓవ‌ర్లు ముగిసే స‌రికి గుజ‌రాత్ వికెట్ న‌ష్ట‌పోకుండా 33 ప‌రుగులు చేసింది. క్రీజులో  శుబ్‌మ‌న్ గిల్‌(15), సాయిసుదర్శ‌న్‌(16) ఉన్నారు.

గుజరాత్‌ ముందు భారీ టార్గెట్‌..
అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాట‌న్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ బ్యాట‌ర్లు విధ్వంసం  సృష్టించారు. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 

లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. 64 బంతులు ఎదుర్కొన్న మార్ష్‌.. 10 ఫోర్లు, 8 సిక్స్‌లతో 117 పరుగులు చేశాడు. అతడితో పాటు నికోలస్ పూరన్‌(56), మార్‌క్రమ్‌(36) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. గుజరాత్ బౌలర్లలో ఆర్షద్ ఖాన్‌, సాయి కిషోర్ తలా వికెట్ సాధిం‍చారు.

మిచెల్ మార్ష్ సూప‌ర్ సెంచ‌రీ..
ల‌క్నో బ్యాట‌ర్ మిచెల్ మార్ష్ తొలి ఐపీఎల్ సెంచ‌రీ సాధించాడు. అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాఛ్‌లో ఈ ఫీట్ న‌మోదు చేశాడు. కేవ‌లం 56 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌ల‌తో మార్ష్ త‌న సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. 16 ఓవర్లకు లక్నో స్కోర్‌: 180/1

15 ఓవర్లకు లక్నో స్కోర్‌: 160/1
15 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టానికి 160 పరుగులు చేసింది. క్రీజులో మిచెల్ మార్ష్‌(89), పూరన్‌(29) ఉన్నారు.

ల‌క్నో తొలి వికెట్ డౌన్‌..
ఐడైన్ మార్‌క్ర‌మ్ రూపంలో ల‌క్నో తొలి వికెట్ కోల్పోయింది. 36 ప‌రుగులు చేసిన మార్‌క్ర‌మ్‌.. సాయికిషోర్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 10 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ల‌క్నో వికెట్ న‌ష్టానికి 97 ప‌రుగులు చేసింది. క్రీజులో మార్ష్‌(51), పూర‌న్‌(6) ఉన్నారు.

దూకుడుగా ఆడుతున్న ల‌క్నో ఓపెన‌ర్లు..
6 ఓవ‌ర్లు ముగిసే సరికి ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ వికెట్ న‌ష్ట‌పోకుండా 53 ప‌రుగులు చేసింది. క్రీజులో ఐడైన్ మార్‌క్ర‌మ్‌(28), మార్ష్‌(22) ఉన్నారు.
నిల‌క‌డ‌గా ఆడుతున్న ల‌క్నో ఓపెన‌ర్లు..
3 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ల‌క్నో సూప‌ర్ జెయింట్స్  వికెట్ న‌ష్ట‌పోకుండా 26 ప‌రుగులు చేసింది. క్రీజులో మార్ష్‌(8), మార్‌క్ర‌మ్‌(15) ఉన్నారు.

ఐపీఎల్‌-2025లో అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజ‌రాత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ నామాత్ర‌పు మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్  క్యాన్సర్ అవగాహన కార్యక్రమానికి మద్దతుగా లావెండర్ జెర్సీతో బ‌రిలోకి దిగింది.

తుది జ‌ట్లు
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్‌రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(కెప్టెన్‌), ఆయుష్ బడోని, అబ్దుల్ సమద్, హిమ్మత్ సింగ్, షాబాజ్ అహ్మద్, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్, విలియం ఒరూర్కే

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్(కెప్టెన్‌), జోస్ బట్లర్(వికెట్ కీప‌ర్‌), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, కగిసో రబడ, మహ్మ‌ద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement