
Photo Courtesy: BCCI/IPL
టీమిండియా స్టార్ బ్యాటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లెజెండ్ విరాట్ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో ఒకే జట్టు తరపున 800 ఫోర్లు కొట్టిన తొలి ఆటగాడిగా విరాట్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ 2025 లో భాగంగా శుక్రవారం లక్నో వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి ఈ ఘనత అందుకున్నాడు.
కోహ్లి ఇప్పటివరకు ఆర్సీబీ తరపున 801 ఫోర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి 25 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 43 పరుగులు చేశాడు. ఇక ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో ఇంగ్లండ్ ఆటగాడు జేమ్స్ విన్స్(694) రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. విన్స్ హాంప్‌షైర్ క్రికెట్ క్లబ్ తరపున ఆడి ఈ ఫీట్ నమోదు చేశాడు.
టీ20ల్లో ఒకే జట్టు తరుపున అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాళ్లు వీరే..
విరాట్ కోహ్లి (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) – 801 ఫోర్లు
జేమ్స్ విన్స్ (హాంప్‌షైర్) – 694 ఫోర్లు
అలెక్స్ హేల్స్ (నాటింగ్‌హామ్‌షైర్) – 563 ఫోర్లు
రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్) – 550 ఫోర్లు
ల్యూక్ రైట్ (సస్సెక్స్) – 529 ఫోర్లు
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ఆర్సీబీకి సన్‌రైజర్స్ ఝులక్ ఇచ్చింది. బెంగళూరుపై 45 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు సాధించింది.
ఇషాన్ కిషన్ (94 నాటౌట్; 48 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా..అభిషేక్ శర్మ (34; 17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), అనికేత్ వర్మ(26; 9 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు), క్లాసెన్(24) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం లక్ష్య చేధనలో ఆర్సీబీ 19.5 ఓవర్లలో 189 పరుగులకే ఆలౌటైంది.
చదవండి: IPL 2025: ఆర్సీబీ కెప్టెన్‌కు భారీ షాక్.. రూ. 24 లక్షల జరిమానా