
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో భాగంగా శుక్రవారం లక్నో వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 42 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలైంది. అయితే ఓటమి బాధలో ఉన్న ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పాటిదార్‌కు భారీ షాక్ తగిలింది.
సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసినందుకు గానూ పాటిదార్‌కు రూ. 24 లక్షల భారీ జరిమానా ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ విధించింది. అలాగే జట్టులో ఇంపాక్ట్ ప్లేయర్ సహా అందరూ రూ. 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానాగా చెల్లించాలని ఆదేశించింది.
ఈ సీజన్‌లో ఆర్సీబీ జట్టు స్లో ఓవర్ రేట్‌ను నమోదు చేయడం ఇది రెండో సారి. అందుకే అంత భారీ మొత్తంలో జరిమానా విధించారు. కాగా ఈ మ్యాచ్‌లో బెంగళూరు సారధిగా జితేష్ శర్మ వ్యవహరించినప్పటికి.. రూల్స్ ప్రకారం ఎవరైతే ఫుల్ టైమ్ కెప్టెన్‌గా ఉంటారో వారే ఫైన్‌ను భరించాల్సి ఉంటుంది.
ఈ క్రమంలోనే పాటిదార్‌పై జరిమానా పడింది. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ కు కూడా స్లో ఓవర్ రేట్ (Slow over rate) కారణంగా జరిమానా విధించారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం కమిన్స్ కు తొలిసారి స్లో ఓవర్ రేట్ కారణంగా రూ. 12 లక్షలు జరిమానా పడింది.
చదవండి: ENG vs ZIM: 22 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌తో టెస్టు.. ఓటమి దిశగా జింబాబ్వే