సైనిక వితంతువుల సంక్షేమ నిధికి  ప్రీతి జింటా రూ.1.10 కోట్ల విరాళం  | Preity Zinta donates Rs 1. 10 crore to Womens Welfare Association | Sakshi
Sakshi News home page

సైనిక వితంతువుల సంక్షేమ నిధికి  ప్రీతి జింటా రూ.1.10 కోట్ల విరాళం 

May 25 2025 6:30 AM | Updated on May 25 2025 12:03 PM

Preity Zinta donates Rs 1. 10 crore to Womens Welfare Association

జైపూర్‌: క్రికెట్‌ జట్టు పంజాబ్‌ కింగ్స్‌ సహ యజమాని, సినీ నటి ప్రీతీ జింటా సైనిక వితంతువుల సంక్షేమ నిధి(ఏడబ్ల్యూడబ్ల్యూఏ)కి రూ.1.10 కోట్ల విరాళం ప్రకటించారు. పంజాబ్‌ కింగ్స్‌ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ(సీఎస్‌ఆర్‌)నిధిలోని జింటా వాటా నుంచి ఈ విరాళాన్ని ఆమె ప్రకటించారు. 

ఈ మొత్తాన్ని సౌత్‌ వెస్టర్న్‌ కమాండ్‌ ఆర్మీ విభాగంలోని వీర నారీమణుల సాధికారితకు, వారి పిల్లల చదువుల కోసం వెచ్చించనున్నారు. శనివారం జైపూర్‌లో జరిగిన ఏడబ్ల్యూడబ్ల్యూఏ సమావేశంలో ప్రీతీ జింటా ఈ విరాళాన్ని ప్రకటించారు. ‘సాయుధ బలగాల కుటుంబాలకు సాయంగా నిలవడం మన బాధ్యత. మన సైనికులు చేసిన త్యాగాలకు తగు మూల్యం ఎప్పటికీ తిరిగి చెల్లించలేం. కానీ, మనం వారి కుటుంబాలకు అండగా ఉండి ముందుకు సాగడానికి మద్దతునిద్దాం’అని ఆమె పేర్కొన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement