బాబుగారూ.. మీ అనుభవం ఏం నేర్పింది? | YS Jagan Counter Chandrababu Year Governance With Debt Statistics | Sakshi
Sakshi News home page

బాబుగారూ.. మీ అనుభవం ఏం నేర్పింది?, ఇదేనా..

Jun 2 2025 2:55 PM | Updated on Jun 2 2025 3:31 PM

YS Jagan Counter Chandrababu Year Governance With Debt Statistics

గుంటూరు, సాక్షి: చంద్రబాబు పాలన ఏడాదికి చేరువవుతున్న వేళ.. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్య చేశారు. దశాబ్దాల అనుభవానికి ఏమైందని.. ఈ ఏడాది కాలంలోనే అడ్డగోలుగా అప్పులు చేసినా ప్రజలకు ఎలాంటి మంచి చేయలేకపోయారని ఎక్స్‌ ఖాతాలో లెక్కలతో సహా సోమవారం ఆయన ఓ పోస్ట్‌ చేశారు. 

ఏడాది పాలనలో ఏపీ ఆర్థిక స్థితి.. చంద్రబాబు ప్రభుత్వం దిగజార్చటంపై వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘చంద్రబాబు గారూ.. దశాబ్దాల మీ అనుభవానికి ఏమైంది?. రాజకీయానుభవంతో పాటు  ముఖ్యమంత్రిగా పని చేసి పాలనను లోతుగా అర్థం చేసుకున్నానని మీరే తరచూ చెబుతుంటారు కదా. కానీ, ఆ అనుభవం ఈ ఏడాదిగా ఏం రాష్ట్రానికి ఏం ఇచ్చింది?. కేవలం ఈ ఏడాది పాలనలో మీరు చేసిన అప్పులు.. ఐదేళ్ల మా హయాంలో చేసిన అప్పుల మొత్తంలో 44 శాతంగా ఉంది. 

ఒకవైపు వాస్తవం ఇలా ఉంటే.. మరోవైపు ఈ ఏడాది కాలంలో అభివృద్ధి, సంక్షేమం జాడే లేదు. మీ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ సరిగ్గా లేదనే వాస్తవాలను కాగ్‌, మోస్పి (CAG & MOSPI) గణాంకాలే చెబుతున్నాయి’’ అంటూ ఒక పోస్ట్‌ చేశారాయన. 

Advertisement
 
Advertisement
Advertisement