కరీంనగర్ నగరం జల దిగ్బంధమైంది. బుధవారం కురిసిన భారీవర్షంతో వరద పోటెత్తింది.
ప్రధాన రహదారులు, చౌరస్తాలు చెరువులను తలపించాయి. మెయిన్‌రోడ్డుపై వాహనాలు గంటల పాటు నిలిచిపోయా యి.
ఇండ్లల్లోకి వరద బురద చేరింది. వేకువజామున నుంచి ఉదయం 10 గంటలవరకు కురిసిన వర్షంతో ముకరంపుర టూటౌన్ పోలీసు స్టేషన్ వద్ద, రాంనగర్ బస్‌స్టాప్, ఆర్‌టీసీ వర్క్‌షాప్, మంచిర్యాల చౌరస్తా, కేబుల్ బ్రిడ్జి, ఆటోనగర్, పోలీసుహెడ్‌క్వార్టర్స్ రోడ్, అలుగునూరు చౌరస్తాలు చెరువును తలపించాయి.
కొన్నిచోట్ల కార్లు వరదలో చిక్కుకుపోయాయి. అలుగునూరు చౌరస్తాలో అంబులెన్స్ వరదలో చిక్కుకుంది.


