గుజరాత్‌ X ముంబై | Gujarat Titans and Mumbai Indians gear up for eliminator match | Sakshi
Sakshi News home page

గుజరాత్‌ X ముంబై

May 30 2025 2:11 AM | Updated on May 30 2025 2:11 AM

Gujarat Titans and Mumbai Indians gear up for eliminator match

ముల్లాన్‌పూర్‌: ఐపీఎల్‌ 18వ సీజన్‌లో బెంగళూరు జట్టు తుది పోరుకు అర్హత సాధించగా... గుజరాత్‌ టైటాన్స్, ముంబై ఇండియన్స్‌ ఎలిమినేటర్‌ మ్యాచ్‌కు సిద్ధమయ్యాయి. శుక్రవారం జరగనున్న పోరులో గెలిచిన జట్టు... క్వాలిఫయర్‌–1లో ఓడిన పంజాబ్‌ కింగ్స్‌తో క్వాలిఫయర్‌–2లో తలపడనుంది. ఓడిన జట్టు లీగ్‌ నుంచి నిష్క్రమిస్తుంది. ఈ సీజన్‌లో ఆడిన 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు, 5 పరాజయాలతో 18 పాయింట్లు ఖాతాలో వేసుకున్న గుజరాత్‌ పట్టికలో మూడో స్థానంతో ‘ప్లే ఆఫ్స్‌’కు చేరుకుంది. 

హార్దిక్‌ పాండ్యా సారథ్యంలోని ముంబై 14 మ్యాచ్‌ల్లో 8 విజయాలు, 6 పరాజయాలతో 16 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి నాకౌట్‌కు చేరింది. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరగగా... రెండింట్లోనూ గుజరాత్‌నే విజయం వరించింది. రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్, రికెల్టన్, హార్దిక్‌ పాండ్యా నమన్‌ ధీర్‌ ముంబై బ్యాటింగ్‌కు కీలకం కానుండగా... జస్‌ప్రీత్‌ బుమ్రా, బౌల్ట్, దీపక్‌ చహర్, సాంట్నర్‌ బౌలింగ్‌ భారం మోయనున్నారు. 

మరోవైపు స్టార్‌ బ్యాటర్‌ జోస్‌ బట్లర్‌ సేవలు అందుబాటులో లేకపోవడంతో గుజరాత్‌ కాస్త వెనుకబడినట్లు కనిపిస్తోంది. కెపె్టన్‌ శుబ్‌మన్‌ గిల్, మరో ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ ప్రదర్శనపైనే ఆ జట్టు భవితవ్యం ఆధారపడి ఉంది. రూథర్‌ఫోర్డ్, షారుక్‌ ఖాన్, రాహుల్‌ తెవాటియా సత్తా చాటాల్సిన అవసరముంది.

ఐపీఎల్‌లో నేడు (ఎలిమినేటర్‌)
గుజరాత్‌ X ముంబై
వేదిక: ముల్లాన్‌పూర్‌
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో  

Advertisement
 
Advertisement
Advertisement