తెలంగాణ ప్రజలకు ముర్ము, మోదీ శుభాకాంక్షలు | President Murmu Modi And Rahul Wishes To Telangana People | Sakshi
Sakshi News home page

తెలంగాణ ప్రజలకు ముర్ము, మోదీ శుభాకాంక్షలు

Jun 2 2025 11:19 AM | Updated on Jun 2 2025 12:23 PM

President Murmu Modi And Rahul Wishes To Telangana People

ఢిల్లీ: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అగ్ర నాయకులు రాహుల్‌ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో ముందుకు సాగాలని కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్విట్టర్‌ వేదికగా..‘రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. యువ రాష్ట్రం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, ఆర్థిక , సాంకేతిక అభివృద్ధి యొక్క శక్తివంతమైన ఆధునిక పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంది. తెలంగాణ ప్రజలు అభివృద్ధి, శ్రేయస్సు మార్గంలో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌ వేదికగా..‘రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు. జాతీయ పురోగతికి లెక్కలేనంత కృషి చేసినందుకు ఈ రాష్ట్రం ప్రసిద్ధి చెందింది. గత దశాబ్దంలో రాష్ట్ర ప్రజల ‘జీవన సౌలభ్యాన్ని’ పెంచడానికి ఎన్డీఏ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రజలు విజయం, శ్రేయస్సుతో ఆశీర్వదించబడాలి’ అని కోరుకుంటున్నట్టు తెలిపారు.

కాంగ్రెస్‌ అగ్రనాయకులు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌ వేదికగా..‘తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. 11 ఏళ్ల క్రితం మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగింది. లక్షలాది మంది కలలను నిజం చేశాం. తెలంగాణ ఉద్యమంలో త్యాగాలు చేసిన వారికి నా హృదయపూర్వక  నివాళులు. తెలంగాణ ప్రతి పౌరుడికి న్యాయమైన, గౌరవప్రదమైన, సంపన్నమైన భవిష్యత్తును ఇవ్వడమే కాంగ్రెస్ పార్టీ ప్రజా తెలంగాణ లక్ష్యం. తెలంగాణ ప్రతి పౌరుడి కలను నిజం చేసేందుకు నిబద్దతతో ఉన్నాం. ఇందుకు మేము ఇచ్చిన గ్యారెంటీలే ప్రతీక’ అని చెప్పుకొచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement