
సాక్షి,న్యూఢిల్లీ: జలశక్తి సమావేశంలో కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గోదావరి,కృష్ణా జలాలపై వివాదాలపై పరిష్కరించేలా కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఆధ్వర్యంలో జలవివాదాల పరిష్కార కమిటీని కేంద్రం నియమిస్తుంది. ఈ నెల 21లోగా కమిటీ ఏర్పాటు కానుంది. హైదరాబాద్‌లోని గోదావరి నది బోర్డు,అమరావతిలోనే కృష్ణానది బోర్డు ఉండేలా నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు రిజర్వయార్ల ప్లో నీటి లెక్కలను గుర్తించేలా టెలిమెట్రీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకు వచ్చేలా కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఈ సమావేశంపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ఇది కేవలం ఇన్ ఫార్మల్ మీటింగ్ మాత్రమే. నాలుగు అంశాలపై పరిష్కారం దొరికింది. కేసీఆర్ ఇన్నాళ్లు వీటికి పరిష్కారం కనుక్కోలేదు. ఈ సమావేశంలో మేము విజయం సాధించాం. అన్ని ప్రాజెక్టులలో టెలిమెట్రి యంత్రాలు పెట్టేందుకు ఏపీ అంగీకరించడం మా విజయం. చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం చేసుకుంటాం..పోరాటం చేయాల్సిన అవసరం లేదు. కృష్ణా, గోదావరిపై ప్రాజెక్టుల అపరిష్కృతంగా ఉన్న అన్ని అంశాలపై ఇంజనీర్ల కమిటీ ముందడుగు చూపిస్తుంది. వారం రోజుల్లో కమిటీ ఏర్పాటు అవుతుందని తెలిపారు.