వైఎస్ జగన్ భద్రతపై వైఎస్సార్‌సీపీ ఆందోళన | YSRCP Raises Serious Concerns Over Jagan Security | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్ భద్రతపై వైఎస్సార్‌సీపీ ఆందోళన

Feb 6 2026 9:14 PM | Updated on Feb 6 2026 9:27 PM

YSRCP Raises Serious Concerns Over Jagan Security

సాక్షి,తాడేపల్లి: పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి భద్రపై వైఎస్సార్‌సీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇటీవల టీడీపీ గూండాల దాడికి గురైన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని శుక్రవారం వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. జోగి రమేష్‌ వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. 

అయితే, తిరుగు ప్రయాణంలో జగన్‌ భద్రతను పోలీసులు పట్టించుకోలేదు.  గ్రామాలు, ఇరుకైన రోడ్ల మీదుగా వైఎస్‌ జగన్‌ కాన్వాయ్‌ను మళ్లించారు. జగన్‌ భద్రతా సిబ్బందికి సైతం సమాచారం ఇవ్వలేదు. పూర్తి నిర్లక్ష్యం ఖాకీలు రెగ్యులర్ రహదారి మీదుగానే తీసుకువెళ్తున్నామని చెప్పి, చివరికి ఇరుకైన రోడ్ల మీదుగా కాన్వాయ్‌ను మళ్లించారు. 

ఈ ఉదయం పోలీసుల విజ్ఞప్తి మేరకు వైఎస్సార్‌సీపీ సహకరించింది. విజయవాడ ప్రధాన రహదారుల మీదుగా కాకుండా, పోలీసులు సూచించినట్టుగానే వెస్ట్రన్ బైపాస్ మీదుగా ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్‌  ఇంటికి వెళ్లారు. కానీ తిరుగు ప్రయాణంలో ఎటు వెళ్తున్నామో పోలీసులు చెప్పలేదు. 

జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కలిగిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ భద్రతను పోలీసులు గాలికి వదిలేయడం బాధాకరమని వైఎస్సార్‌సీపీ తీవ్రంగా విమర్శించింది. ఈ నిర్లక్ష్యాన్ని కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకెళ్లి, తగిన చర్యలు తీసుకోవాలని పార్టీ నిర్ణయించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement