రేవంతుద్దీన్‌ అంటే నాకు సంతోషమే | CM Revanth Reddy Nizamabad Public Meeting: Revanth Reddy comments on Ramchander Rao | Sakshi
Sakshi News home page

రేవంతుద్దీన్‌ అంటే నాకు సంతోషమే

Feb 7 2026 4:30 AM | Updated on Feb 7 2026 4:30 AM

CM Revanth Reddy Nizamabad Public Meeting: Revanth Reddy comments on Ramchander Rao

సౌమ్య కుటుంబానికి రూ.కోటి చెక్కు అందజేస్తున్న సీఎం రేవంత్‌

కానీ కిషన్‌రెడ్డి కల్వకుంట్ల కిషన్‌రావుగా మారాడు

కేసీఆర్‌కు కేటీఆర్‌ దొంగపుత్రుడు.. కిషన్‌రెడ్డి దత్తపుత్రుడు... కేసీఆర్‌ జైలుకు వెళ్లకుండా కేంద్రమంత్రి కాపాడుతున్నారు 

నిజామాబాద్‌ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: ‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు నన్ను రేవంతుద్దీన్‌ అని ముస్లిం పేరుతో పిలిచారు. ఈ పిలుపును నేను సంతోషంగా స్వీకరిస్తా. అయితే రాంచందర్‌రావు పక్కన కూర్చున్న కిషన్‌రెడ్డి మాత్రం కల్వకుంట్ల కిషన్‌రావుగా మారి కేసీఆర్‌ను జైలుకు వెళ్లకుండా కాపాడుతున్నారు. కేసీఆర్‌కు కేటీఆర్‌ అనే దొంగ పుత్రుడు ఉండగా, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కల్వకుంట్ల కిషన్‌రావు  దత్తపుత్రుడిగా మారాడు.

ఈ దత్తపుత్రుడు కేసీఆర్, హరీశ్‌రావులను కాపాడుతున్నాడు. గతంలో మోదీ రాష్ట్రానికి వచి్చనప్పుడు కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌ను ఆరు నెలల్లో జైలుకు పంపుతామని చెప్పిన కిషన్‌రెడ్డి ఇప్పుడు ఏ బొక్కలో దాక్కున్నాడు?..’అంటూ సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. కిషన్‌రెడ్డిని జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును కోరుతున్నా అని అన్నారు. శుక్రవారం నిజామాబాద్‌ జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారం¿ోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం కేశాపూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.  

కేసీఆర్‌ను ఎప్పుడు జైలుకు పంపుతారు? 
    ‘కేసీఆర్‌ను ఎప్పుడు జైలుకు పంపుతారని కిషన్‌రెడ్డి, ఎంపీ అరి్వంద్‌లను ప్రశి్నస్తున్నా. కేసీఆర్, హరీశ్‌రావులను జైల్లో పెట్టి చిప్ప కూడు తినిపించాలని «ఎంపీ ధర్మపురి అరి్వంద్‌ అంటుంటారు. మేం కాళేశ్వరం విషయమై శాసనసభలో చర్చ పెట్టి కేసును సీబీఐకి ఇచ్చాం. ఇప్పటివరకు సీబీఐ పట్టించుకోలేదు. కేసీఆర్, హరీశ్‌రావులను చర్లపల్లి జైలులో పెట్టకుండా ఎవరు అడ్డుకుంటున్నారు? దీనిపై ధర్మపురి అరి్వంద్‌ ఎందుకు మాట్లాడరు?..’అని సీఎం ప్రశ్నించారు. 

అన్ని కులాలను సమన్వయం చేసుకుంటూ వెళ్తా.. 
    ‘బ్రిటిష్‌ హయాం తర్వాత 100 ఏళ్ల వరకు బీసీ కులగణన జరగలేదు. ఇప్పుడు కులగణన చేసినందుకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ నన్ను గతంలో రేవంత్‌గౌడ్‌ అని అన్నారు. ఎస్సీ వర్గీకరణకు శాశ్వత పరిష్కారం చూపడంతో మంత్రి దామోదర రాజనర్సింహ రేవంత్‌ మాదిగ అన్నారు. 30 ఏళ్లు కాంగ్రెస్‌ కార్యకర్తగా పనిచేసిన వాకిటి శ్రీహరిని మంత్రిని చేస్తే ముదిరాజ్‌ వర్గం నన్ను రేవంత్‌ ముదిరాజ్‌ అని వ్యాఖ్యానించింది. అనిల్‌కుమార్‌ యాదవ్‌ను రాజ్యసభకు పంపిస్తే రేవంత్‌ యాదవ్‌ అని పిలిచారు. స్వర్ణ దేవాలయాన్ని నిర్మిస్తానన్నందుకు సిక్కు సోదరులు సర్దార్‌ రేవంత్‌ సింగ్‌ అని పిలిచారు.

ఇవన్నీ నాకు సంతోషం కలిగించాయి. కాంగ్రెస్‌ పార్టీ ముస్లింలకు 4% రిజర్వేషన్లు ఇవ్వడంతో పాటు ఆ వర్గానికి అనేక పదవులు ఇచి్చంది. షబ్బీర్‌ అలీ నిజామాబాద్‌లో గెలవకపోయినా పదవి ఇచ్చాం. ఎమ్మెల్యేగా ఓడిపోయినా అజహరుద్దీన్‌ను ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలోకి తీసుకున్నాం. 8 మంది మైనారిటీ నాయకులకు కార్పొరేషన్‌ పదవులు ఇచ్చాం. కాబట్టి రాంచందర్‌రావు నన్ను రేవంతుద్దీన్‌ అని పిలిచినా సంతోషంగా తీసుకుంటా. నాకు ఎలాంటి సమస్య లేదు. అన్ని కులాలు, మతాలను సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పథం వైపు తీసుకెళ్తా. తెలంగాణను నంబర్‌ వన్‌గా తయారు చేస్తా..’అని ముఖ్యమంత్రి చెప్పారు. 

బీజేపీ, బీఆర్‌ఎస్‌లది వీణావాణి బంధం 
    ‘కేసీఆర్‌ ప్రభుత్వంలో పదేళ్లలో ఒక్క రేషన్‌కార్డు కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక లక్షలాది రేషన్‌ కార్డులు ఇచ్చాం. రాష్ట్రంలో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నాం. 50 లక్షల పేద కుటుంబాలకు 200 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్‌ అందిస్తున్నాం. రూ.500లకే 50 లక్షల కుటుంబాలకు సిలిండర్‌ ఇస్తున్నాం. ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాం. సన్న ధాన్యానికి రూ.500 బోనస్‌ అమలు చేస్తున్నాం. బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీల్లో ఎవరికి ఓటేసినా మూసీలో వేసినట్లే. ఈ రెండు పార్టీలది వీణావాణి బంధం.. ఫెవికాల్‌ బంధం..’అని సీఎం విమర్శించారు. 

నేను, మహేశ్‌గౌడ్‌ జోడెద్దుల్లా పనిచేస్తున్నాం.. 
    ‘నేను, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ జోడెద్దుల్లాగా కలిసి పని చేస్తున్నాం. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, ధర్మపురి శ్రీనివాస్‌ సారథ్యంలో 2004, 2009లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. మళ్లీ 2023లో నేను పీసీసీ అధ్యక్షుడిగా, మహేశ్‌గౌడ్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చాం. 2028లోనూ నేను సీఎంగా, మహేశ్‌గౌడ్‌ పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తాం. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఇంకా ఎనిమిదేళ్లు అధికారంలో ఉంటుంది..’అని రేవంత్‌ చెప్పారు. ఈ సభలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ. ఎమ్మెల్యే డాక్టర్‌ భూపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement