ఆ ఫ్లెక్సీలు తొలగించండి. వైఎస్సార్‌సీపీ నిరసన | Controversial Flex Banners Chirala Spark Tensions | Sakshi
Sakshi News home page

ఆ ఫ్లెక్సీలు తొలగించండి. వైఎస్సార్‌సీపీ నిరసన

Feb 6 2026 9:59 PM | Updated on Feb 6 2026 10:03 PM

Controversial Flex Banners Chirala Spark Tensions

చీరాల:  బాపట్ల జిల్లాలోని చీరాలలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందంటూ టీడీపీ ఫ్లెక్సీలు వెలిశాయి. టీడీపీ కట్టిన ఫ్లెక్సీలకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ నిరసన చేపట్టింది.  దీనిపై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

వివాదాస్పద ఫ్లెక్సీలను తొలగించేందుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు యత్నించాయి. అయితే టీడీపీ కట్టిన ఫ్లెక్సీల వద్దకు వెళ్లకుండా పోలీసుల అడ్డుకున్నారు. వివాదాస్పద ఫ్లెక్సీలను తొలగించాలంటూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు బైఠాయించాయి. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. 


 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement