‘మోదీకి రాహుల్ గాంధీ భయపడతారా?’ | Deputy CM Mallu Takes On BJP And Modi | Sakshi
Sakshi News home page

‘మోదీకి రాహుల్ గాంధీ భయపడతారా?’

Apr 17 2025 6:23 PM | Updated on Apr 17 2025 6:25 PM

Deputy CM Mallu Takes On BJP And Modi

హైదరాబాద్: నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పేర్లను ఈడీ తన చార్జిషీట్ లో నమోదు చేయడాన్ని టీపీసీసీ వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టింది. దీనిలో భాగంగా నగరంలో కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ  మేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ‘ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు కేసులకు భయపడతారా?,  దేశం కోసం త్యాగం చేసిన వారి రక్తం రాహుల్ గాంధీలో పారుతోంది. 

కేసులు పెడతా.. జైల్లో పెడతా అంటే స్వతంత్ర ఉద్యమంలో నెహ్రా తలొగ్గలేదు. బ్రిటీష్ వాళ్లకే గాంధీ కుటుంబం భయపడలేదు. మోదీకి రాహుల్ గాంధీ భయపడతారా?, అఫ్ట్రాల్ బీజేపీకి రాహుల్ గాంధీ భయపడరు. కుట్రలో బాగంగా రాహుల్ గాంధీపై కేసు. బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తుంది పార్టీ. ఈవీఎంలతో ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోతోంది. గుజరాత్‌లో మోదీకి రాహుల్ గాంధీ సవాల్ చేయడంతో కేసులు బనాయిస్తున్నారు’ అని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు.

ఐటీ నాలెడ్జ్ హబ్ ఏర్పాటుపై సమీక్ష
ంతకుముందు పుప్పలగూడ పరిసరాల్లో 400 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్ ఏర్పాటుకు సంబంధించిన అంశంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు.  ఈ సమావేశంలో మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పరిశ్రమలు, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement