మన ఫైటర్ జెట్స్‌ను కోల్పోయాం: సీడీఎస్‌ | Indian Armed Forces Top General On Op Sindoor Losses | Sakshi
Sakshi News home page

మన ఫైటర్ జెట్స్‌ను కోల్పోయాం: సీడీఎస్‌

May 31 2025 7:51 PM | Updated on May 31 2025 8:30 PM

Indian Armed Forces Top General On Op Sindoor Losses

న్యూఢిల్లీ:   పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అయ్యింది. నేరుగా పాక్ లో కి దూసుకుపోయి మరీ ఉగ్రస్థావరాలను, పలు పాకిస్తాన్ ఎయిర్ బేస్ లను భారత్ నేలమట్టం చేసింది. దీన్ని తిప్పికొట్టాలని పాక్ ప్రయత్నించినా ఆపరేషన్ సిందూర్ విధ్వంసాన్ని ఆపడం వారి వల్ల కాలేదు.  ఆపరేషన్ సిందూర్ తో పాక్ రక్షణ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమయ్యిందనే నిజాన్ని కూడా ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సైతం ధృవీకరించారు.

ఇదిలా ఉంటే, పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో భారత్ ఎన్ని యుద్ధ విమానాలను కోల్పోయిందనే వాదన ఇప్పుడు తెరపైకి వచ్చింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ దీన్ని లేవెనెత్తింది. భారత్ రాఫెల్ యుద్ధ విమానాలను కోల్పోయిందా.. లేదా చెప్పాలంటూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. 

దీనిపై కేంద్రం ఏమీ క్లారిటీ ఇవ్వకపోయినా,  భారత బలగాల సీడీఎస్(చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్) అనిల్ చౌహాన్ ఎట్టకేలకు తొలిసారి స్పందిస్తూ.. ‘ అవును.. పాక్ తో జరిగిన యుద్ధంలో భారత్ ఫైటర్ జెట్స్ ను కోల్పోయిన మాట వాస్తవమే.  యుద్ధం అన్నాక కొన్ని ఇలా జరుగుతూనే ఉంటాయి. మనం ఎన్ని కోల్పోయాం అనేది ప్రశ్న కాదు.. ఎందుకు కోల్పోయాం అనేది మాత్రమే సమీక్షించుకోవాలి. అయితే పాకిస్తాన్ చెప్పినట్లు ఆరు ఫైటర్ జెట్స్ ను మనం కోల్పోలేదు. అందులో వాస్తవం లేదు’ అని స్పష్టం చేశారు. 

సింగపూర్ లోని బ్లూమ్ బర్గ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు అనిల్ చౌహాన్. అయితే కోల్పోయిన ఫైటర్‌ జెట్స్‌  ఏమిటనేది మాత్రం చెప్పలేదు. అదే సమయంలో ఎన్ని ఫైటర్‌ జెట్స్‌  కోల్పోయమనేది కూడా చెప్పలేదు. అది ప్రస్తుతం అప్రస్తుతం అన్న రీతిలోనే ఆయన సమాధానం చెప్పారు.  ఇక్కడ సంఖ్య అనేది ముఖ్యం కాదంటూ బదులిచ్చారాయన.

Advertisement
 
Advertisement
Advertisement