చిన్నప్పుడే కష్టాలు, ఆర్థిక కష్టాలు కొందర్ని దృఢంగా ఎదిగేలా చేస్తాయి. పైగా ఆ సవాళ్లను తమ అభ్యున్నతికి బాటలుగా మలుచుకుని అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. హాయిగా చదువు సాగించిన వారికంటే..టాప్ పొజిషన్‌లో సెటిల్ అయ్యి స్ఫూర్తిగా నిలుస్తారు. అలాంటి కోవకు చెందిన వాడే క్రెడ్ వ్యవస్థాపకుడు కునాల్ షా కథ. అతడి స్టోరీ సినిమాని తలపించే కథలా ఉంటుంది.
కునాల్ షా అరుదైన స్టార్టప్ వ్యవస్థాపకులలో ఒకరు. ఆయన చిన్న వయసులోనే ఉద్యోగ కెరీర్‌ని ప్రారంభించారు. తండ్రి వ్యాపారం కుప్పకూలడంతో ఒక్కసారిగా కుటుంబం రోడ్డున పడిపోయింది. దాంతో కుటుంబాన్ని పోషించుకోవడానికి అనేక చిన్నా చితక పనులు చేశారు. 16 ఏళ్ల వయసు వచ్చేసరికి డెలివరీ బాయ్‌గా, డేటా ఆపరేటర్‌గా, మెహందీ కోన్‌ల అమ్మకందారుడిగా, సైబర్ కేఫ్ ఆపరేటర్‌గా, పైరేటెడ్ సీడీల అమ్మకందారుడిగా, కంప్యూటర్ ట్యూటర్‌గా పనిచేస్తూ ఆర్థిక స్వేచ్ఛను సాధించారు.
అలాగే ఆయన ఐఐటీ ఐఐఎం డిగ్రీలు లేదా కనీసం సాంకేతిక ఎడ్యుకేషన్ కాకుండా..ముంబైలోని విల్సన్ కాలేజీలో ఫిలాసఫీని ఎంచుకున్నారు. ఆ సబ్జెక్టుని ఆయన ఎంచుకోవడానికి రీజన్ ఉదయం 8 నుండి 10 గంటల వరకు మాత్రమే తరగతులు ఉండే ఏకైక కోర్సు కావడంతోటే అది ఎంచుకున్నారట కునాల్. మిగిలిన సమయంలో ఉపాధి చూసుకోవడం కోసం ఇలా చేశారు. ఆ తర్వాత ఎంబిఏలో చేరారు. కానీ దాన్ని పూర్తి చేయకుండానే మధ్యలోనే వదిలేశారు.
అలాంటి వ్యక్తి భారతదేశపు తొలి డిజిటల్ చెల్లింపుల స్టార్టప్‌లలో ఒకటైన ఫ్రీఛార్జ్‌ను నిర్మించారు. దీనిని 2017లో యాక్సిస్ బ్యాంకుకు సుమారు $60 మిలియన్లకు(రూ.56.68 కోట్లు) విక్రయించారు. 2018లో $1 మిలియన్ (రూ. 9.46 కోట్లు) వ్యక్తిగత పెట్టుబడితో క్రెడ్‌ను ప్రారంభించారు. క్రెడ్‌కు ప్రస్తుతం నెలకు 1.7 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. కేవలం క్రెడిట్ కార్డ్ బిల్లులను సకాలంలో చెల్లించే వినియోగదారులకు రివార్డులు అందించడం కోసం మాత్రమే ఉద్దేశించిన ప్లాట్‌ఫామ్‌గా రూపొందించిన యాప్ ఇది.
ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్‌బర్గ్ ఈ క్రెడ్ కంపెనీపై ప్రశంసల వర్షం కురిపించారు. షా దీనిని భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన టెక్నాలజీ కంపెనీలలో ఒకటిగా తీర్చిదిద్దారని కొనియాడారు. అంతేగాదు ప్రపంచంలోనే అతిపెద్ద మెసేజింగ్ యాప్‌ను నడపడానికి అవసరమైన నిర్మాణ దృక్పథం, ప్రపంచ దృష్టికోణాన్ని తీసుకువచ్చారని ప్రశంసించారు. క్రెడ్‌లో మెటా 20% వాటాను కొనుగోలు చేయడంతో, ఇప్పుడు ఆ కంపెనీ విలువ $4.5 బిలియన్లుగా(రూ.4 వేల కోట్లు) ఉంది.
ప్రస్తుతం షా AI-ఆధారిత వినియోగదారు ఉత్పత్తులపై దృష్టి పెట్టడానికి మెటాలో ప్రస్తుత వాట్సాప్ గ్లోబల్ హెడ్ విల్ క్యాత్‌కార్ట్ స్థానంలో షా బాధ్యతలు స్వీకరించనున్నారు ఇక క్రెడ్‌లో వ్యూహం, ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించిన మిధున్ సంపత్ తాత్కాలిక సీఈఓ పాత్రను చేపట్టనున్నారు.
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే..
ఉద్యోగ నియామకాల సమయంలో డిగ్రీలకు ప్రాధాన్యత ఇవ్వని బహుముఖ ప్రజ్ఞాశాలి కునాల్. లింక్డ్‌ఇన్ (LinkedIn)లో షాను నేరుగా ట్యాగ్ చేయడం ద్వారా క్రెడ్‌లో ఇంటర్న్‌షిప్‌లు పొందిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేగాదు తన సంస్థలో పనిచేసే ఉద్యోగులు ఎల్లప్పుడూ సీరియస్‌గా ఉండనివ్వరూ..అక్కడ అంతర్గత మీమ్ ఛానెల్స్ ఉంటాయి.
వాటి సాయంతో అక్కడ షాతో సహా ఉద్యోగులు ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ ఉంటారని కునాల్ సన్నిహితులు చెబుతున్నారు. అలాగే అక్కడ సీరియస్‌నెస్‌గా పనిచేసే వారిని కంపెనీ మెచ్చదట. కేవలం ఉద్యోగులు ఆహ్లాదభరితంగా పనిచేసే సంస్కృతికి పెద్దపీట వేయడం కునాల్ ప్రత్యేకతని సన్నిహిత వర్గాలు చెబుతుండటం విశేషం.
(చదవండి: రాయల్ ఆస్కట్ కార్యక్రమంలో డ్రెస్‌కు బదులుగా చీర..! బ్రిటన్ పౌరురాలేనే ఐనా..)


