చికంకారీ చీరలో నీతా.. బనారసీ స్టైలిష్‌ శారీలో నటాషా..! | Nita Ambani, Natasha Poonawalla's Sarees Prove Craft Is the Ultimate Luxury | Sakshi
Sakshi News home page

చికంకారీ చీరలో నీతా.. బనారసీ స్టైలిష్‌ శారీలో నటాషా..! హస్తకళే..

Jun 22 2026 12:18 PM | Updated on Jun 22 2026 12:23 PM

Nita Ambani, Natasha Poonawalla's Sarees Prove Craft Is the Ultimate Luxury

బిలియనీర్లు అంటే హై ష్యాషన్‌ బ్రాండెడ్‌ దుస్తులు..లగ్జరీయస్‌ ఆభరణాలు మాత్రమే కాదు అని నిరూపిస్తున్నారు నీతా అంబానీ, నటాషా పూనవాలాలు. ఈ ఇద్దరూ అసాధారణమైన హస్తకళా నైపుణ్యం, వస్త్ర వారసత్వం, శతాబ్దాల నాటి పద్ధతులకు సజీవంగా ఉంచేలా కళకారుల ప్రతిభను ప్రదర్శించడం విశేషం. తాజాగా ఈ ఇద్దరూ అందమైన చీరలుక్స్‌తో అందర్నీ విస్తుపోయేలా చేశారు. 

ఇక్కడ నీతా అంబానీ లక్నో చికంకారి చీరను ఎంచుకోగా, నటాషా పూనావాలా బనారసీ నేతలోని గొప్పతనాన్ని చాటిచెప్పేలా పురాతన హై ఫ్యాషన్‌తో మేళవించింది. ఈ రెండు చీరలు సమకాలీన శైలి నిరంతరం ఎలా పరిణామం చెందుతోంది ప్రపంచానికి చాటిచెప్పేలా ధరించి చూపారు. ఇక్కడ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముఖేష్‌ అంబానీ సతీమణి నీతా అంబానీ ఎంబ్రాయిడరీ చేసిన యాంటీక్‌ మావ్‌ రంగు చికంకారి చీరలో అందంగా కనిపించారు. 

 

డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా ఈ చీర గురించి ఇలా వివరించారు. పలుచని వస్త్రంపై సున్నితమైన పూల జాలీలు మొత్తం అలిమేయగా..ఇందులో క్లిష్టమైన జాలీ, ముర్రీ, షూస్‌ పట్టి, బద్లా వంటి వర్క్‌లు ఉన్నాయని చెప్పారు. అంతేగాదు ఈ చీరకు మనీష్‌ మల్హోత్రా ఆర్గాంజా లేస్‌ బ్లౌజ్‌ని జత చేశారు. ఇక బిలియనీర్‌ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈ అదర్ పూనావాలా భార్య నటాషా పూనావాలా సంప్రదాయాన్ని ఉన్నత ఫ్యాషన్‌ మేళవింపుతో కూడిన లుక్‌లో మెరిశారు. 

ఫ్యాషన్‌కే ఐకాన్‌గా తన రూపాన్ని మలుచుకునే పూనావాలా సందర్భోచిన వస్త్రాధారణలో సరిహద్దులను విస్తరిస్తూ..ఆడంబరానికి కేరాఫ్‌గా ఉంటారామె. ఈసారి కూడా అలానే ఆకర్షణీయమైన లుక్‌లో కనిపించారు. అద్భుతమైన రియల్‌ వెండి జరీ బనారసీ రంగకట్‌ చీరను ధరించారు. రియా కపూర్ స్టైల్ చేసిన ఈ చీరను, య్వెస్ సెయింట్ లారెంట్ వారి 1988 నాటి క్యూబిస్ట్ జాకెట్‌తో జత చేశారు.

ఇది సాంప్రదాయ భారతీయ వస్త్ర కళానైపుణ్యం వింటేజ్ శైలుల అద్భుతమైన కలయిక. అంతేగాదు ఆమె తన ఆహార్యాన్ని భారీ ఝుమ్కాలు, చోకర్ నెక్లెస్ వంటి ప్రత్యేకమైన ఆభరణాలతో పూర్తి చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌ అయ్యాయి.

 

 

(చదవండి: భారత్‌ నుంచి అమ్మ పెంపకం గురించి తెలుసుకున్నా..!: విదేశీ మహిళ)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement