అస్సాంలో భారీ వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు.. రిలయన్స్ ఫౌండేషన్ అండగా నిలిచింది. రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్‌పర్సన్ నీతా అంబానీ అస్సాం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.21 కోట్ల విరాళాన్ని ప్రకటించారు.
వరదలతో నష్టపోయిన ప్రతి కుటుంబం పట్ల తనకు ఎంతో బాధ ఉందని, అస్సాం ప్రజలు ఒంటరిగా లేరని నీతా అంబానీ భరోసా ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలో కొనసాగుతున్న రిలయన్స్ సహాయక చర్యలకు అదనంగా ఈ సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.
రిలయన్స్ ఫౌండేషన్ బృందాలు అస్సాంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో సహాయక కార్యక్రమాలు చేపడుతున్నాయి. ముఖ్యంగా శివసాగర్, చరైడియో జిల్లాల్లో అవసరమైన కుటుంబాలకు ఆహారం, తాగునీరు, ఆరోగ్య సేవలు, అత్యవసర వసతి వంటి సహాయాన్ని అందిస్తున్నారు. వాటర్ ప్యూరిఫికేషన్ యూనిట్ల ఏర్పాటు, ఆరోగ్య కేంద్రాల పునరుద్ధరణ, కమ్యూనిటీ కిచెన్ల నిర్వహణతో పాటు వంటరా బృందాల ద్వారా పశువులకు వైద్య సహాయం కూడా అందిస్తున్నారు.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ.. నీతా అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ సేవలను ప్రశంసిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. కష్టకాలంలో ఎప్పుడూ అండగా నిలుస్తున్న రిలయన్స్ సహాయం ప్రజలకు ఎంతో ఉపయోగపడుతోందని అన్నారు.
వరదల సమయంలో మనుషులతో పాటు పశువులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రిలయన్స్‌కు చెందిన వంటరా (Vantara) బృందాలు గ్రామాల్లో పశువుల కోసం వైద్య సహాయం, సంరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. స్థానిక అధికారులు, గ్రామ ప్రజలతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన ప్రాంతాలకు సహాయాన్ని చేరవేస్తున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమాల ద్వారా వేలాది మంది ప్రజలు ప్రయోజనం పొందారని రిలయన్స్ ఫౌండేషన్ తెలిపింది.
Standing by the people of Assam. 🤝
"We stand with you today, and we will continue to stand with you in the days ahead," shared Mrs. Nita Ambani, Founder & Chairperson, Reliance Foundation, expressing solidarity with flood-affected families in Assam and reaffirming Reliance… pic.twitter.com/os0GgGQxu0— Reliance Foundation (@ril_foundation) August 3, 2026


