కాల్ డ్రాప్ అవుతోందా? వాయిస్‌లో సమస్యలా..? ఇకపై నేరుగా ట్రాయ్‌కి ఫిర్యాదు చేయొచ్చు | TRAI Launches Revamped MyCall App, Know The Details | Sakshi
Sakshi News home page

కాల్ డ్రాప్ అవుతోందా? వాయిస్‌లో సమస్యలా..? ఇకపై నేరుగా ట్రాయ్‌కి ఫిర్యాదు చేయొచ్చు

Aug 3 2026 5:20 PM | Updated on Aug 3 2026 5:57 PM

TRAI Launches Revamped MyCall App, Know The Details

మొబైల్ ఫోన్ వినియోగం పెరిగిన ఈ రోజుల్లో.. కాల్ నాణ్యత ప్రతి ఒక్కరికీ అవసరంగా మారింది. అయితే.. కొన్నిసార్లు కాల్ డ్రాప్‌లు, వాయిస్ స్పష్టంగా వినిపించకపోవడం, ఆలస్యం వంటి సమస్యలు వినియోగదారులను ఇబ్బంది పెడుతున్నాయి. ఈ సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు.. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) తన మైకాల్ (MyCall) మొబైల్ అప్లికేషన్‌ను కొత్త ఫీచర్లతో అందుబాటులోకి తీసుకొచ్చింది.

కొత్తగా అప్‌డేట్ చేసిన ఈ యాప్ ద్వారా వినియోగదారులు తమ కాల్ అనుభవాన్ని నేరుగా తెలియజేయవచ్చు. కాల్ ముగిసిన వెంటనే ఒకటి నుంచి ఫైవ్ స్టార్ వరకు రేటింగ్ ఇచ్చి, కాల్ నాణ్యతపై తమ అభిప్రాయాన్ని నమోదు చేయవచ్చు. దీనివల్ల టెలికాం సంస్థలకు వినియోగదారులు ఎదుర్కొంటున్న అసలు సమస్యలు ఏమిటనేది సులభంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది.

తమ కాలింగ్ అనుభవ సమస్యలను సర్వీస్ ప్రొవైడర్లకు నివేదించడానికి ఈ యాప్ వినియోగదారులకు ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగపడుతుందని.. ట్రాయ్ ఛైర్మన్ అనిల్ కుమార్ లహోటి వెల్లడించారు.

ఈ యాప్‌లో కేవలం రేటింగ్ ఇవ్వడమే కాకుండా.. కాల్ డ్రాప్‌లు, కాల్ సమయంలో రీసౌండ్, ఆడియో ఆలస్యం, వేరే కాల్ కనెక్ట్ కావడం (క్రాస్ కనెక్షన్), వాయిస్ మధ్యలో కట్ అవ్వడం వంటి సమస్యలను కూడా రిపోర్ట్ చేసే అవకాశం ఉంది. వినియోగదారులు ఇచ్చే ఈ వివరాలు సంబంధిత టెలికాం సంస్థలకు చేరి.. సమస్యలను పరిష్కరించేందుకు సహాయపడతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement