
ఐపీఎల్-2025 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ కథ ముగిసింది. శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌లో 20 పరుగుల తేడాతో గుజరాత్ ఓటమి పాలైంది. దీంతో ఈ మెగా ఈవెంట్ నుంచి గుజరాత్ నిష్కమ్రించింది. 229 పరుగుల భారీ లక్ష్య చేధనలో సాయిసుదర్శన్(49 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 80), వాషింగ్టన్ సుందర్(48) అద్బుత ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికి.. మిగితా బ్యాటర్ల నుంచి సహకారం లభించకపోవడంతో గుజరాత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఓటమికి ప్రధాన కారణం చెత్త ఫీల్డింగ్. మ్యాచ్ ఆరంభంలోనే ముంబై స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు రెండు లైఫ్‌లు వచ్చాయి. వరుస ఓవర్లలో అతడి ఇచ్చిన ఈజీ క్యాచ్‌లను గుజరాత్ ఫీల్డర్లు జారవిడిచారు. అందుకు గుజరాత్ భారీ మూల్యం చెల్లుంచుకోవాల్సి వచ్చింది.
3 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రోహిత్.. ఏకంగా 81 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. బౌలర్లు కూడా భారీ పరుగులు సమర్పించుకున్నారు. పేలవ ఫీల్డింగ్, బౌలింగ్ కారణంగానే ఈ టోర్నీ నుంచి ఎలిమినేట్ కావాల్సి వచ్చింది.
కన్నీరు పెట్టుకున్న నెహ్రా ఫ్యామిలీ..
ఇక ఓటమి అనంతరం గుజరాత్ టైటాన్స్ ప్రధాన కోచ్ ఆశిష్ నెహ్రా కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. స్టాండ్స్‌లో కూర్చున్న నెహ్రా కుమారుడు, కూమర్తె ఎక్కి ఎక్కి ఏడ్చారు. ఈ సమయంలో పక్కనే ఉన్న గుజరాత్ కెప్టెన్ గిల్ సోదరి షహ్నీల్ గిల్ కూడా వారిని ఓదర్చే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఆమె కూడా భోవోద్వేగానికి లోనైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
𝙈𝙄-𝙜𝙝𝙩𝙮 effort on a 𝙈𝙄-𝙜𝙝𝙩𝙮 occasion 💙@mipaltan seal the #Eliminator with a collective team performance ✌
Scorecard ▶ https://t.co/R4RTzjQNeP#TATAIPL | #GTvMI | #TheLastMile pic.twitter.com/cJzBLVs8uM— IndianPremierLeague (@IPL) May 30, 2025
Nehra ka Beta bada hoke humse badla lega 🤣🤣#MIvsGT pic.twitter.com/2j8Z17Hxx1
— WTF Cricket (@CricketWtf) May 30, 2025