
PC: BCCI/IPL.com
IPL 2025 RCB vs SRH Live Updates: ఆర్సీబీని చిత్తు చేసిన ఎస్‌ఆర్‌హెచ్..
ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ బిగ్ షాకిచ్చింది. లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీపై 42 పరుగుల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్ విజయం సాధించింది. 232 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 19.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది
ఆర్సీబీ బ్యాటర్లలో ఫిల్ సాల్ట్(62), విరాట్ కోహ్లి(43) అద్బుత ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికి మిడిలార్డర్ విఫలం కావడంతో ఆర్సీబీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఇషాన్ మలింగ రెండు, ఉనద్కట్, దూబే, నితీష్ కుమార్ రెడ్డి, హర్షల్ పటేల్ తలా వికెట్ సాధించారు.
ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు
ఒకే ఓవర్‌లో ఆర్సీబీ రెండు వికెట్లు కోల్పోయింది. 16 ఓవర్ వేసిన ఇషాన్ మలింగ బౌలింగ్‌లో తొలుత రజిత్ పాటిదార్(18) రనౌట్ కాగా.. ఆ తర్వాత షెఫర్డ్(0) ఔటయ్యాడు. ఆర్సీబీ విజయానికి 24 బంతుల్లో 58 పరుగులు కావాలి.
ఆర్సీబీ మూడో వికెట్ డౌన్
129 పరుగుల వద్ద ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. 62 పరుగులు చేసిన సాల్ట్.. కమ్మిన్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 12 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ 3 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది.
ఆర్సీబీ రెండో వికెట్ డౌన్..
మయాంక్ అగర్వాల్ రూపంలో ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్.. నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్‌లో ఔటయ్యాడు.
ఫిల్ సాల్ట్ ఫిప్టీ..
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ వికెట్ కీపర్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ హాఫ్ సెంచరీ సాధించాడు. 27 బంతుల్లో సాల్ట్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 10 ఓవర్లకు ఆర్సీబీ వికెట్ నష్టానికి 118 పరుగులు చేసింది.
ఆర్సీబీ తొలి వికెట్ డౌన్..
విరాట్ కోహ్లి రూపంలో ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 43 పరుగులు చేసిన కోహ్లి.. హర్ష్ దూబే బౌలింగ్‌లో ఔటయ్యాడు. 8 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టానికి 96 పరుగులు చేసింది. క్రీజులో ఫిల్ సాల్ట్(38), మయాంక్ అగర్వాల్(5) ఉన్నారు.
6 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 72/0
6 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(42), ఫిల్ సాల్ట్(20) ఉన్నారు.
దూకుడుగా ఆడుతున్న విరాట్..
2 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(11), ఫిల్ సాల్ట్(2) ఉన్నారు.
ఇషాన్ కిషన్ విధ్వంసం.. ఆర్సీబీ ముందు భారీ టార్గెట్
లక్నో వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు దుమ్ములేపారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 48 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో కిషన్ 94 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
అతడితో పాటు అభిషేక్ శర్మ(17 బంతుల్లో 34), క్లాసెన్(24), హెడ్(17), అనికేత్ వర్మ(9 బంతుల్లో 26) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆర్సీబీ బౌలర్లలో రొమారియో షెపర్డ్ రెండు వికెట్లు పడగొట్టగా.. సుయాష్, ఎంగిడీ,భువనేశ్వర్, పాండ్యా తలా వికెట్ సాధించారు.
ఎస్ఆర్‌హెచ్ ఐదో వికెట్ డౌన్
నితీష్ కుమార్ రెడ్డి రూపంలో ఎస్ఆర్‌హెచ్ ఐదో వికెట్ కోల్పోయింది. కేవలం 4 పరుగులు మాత్రమే చేసిన నితీష్.. రొమోరియా షెఫర్డ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 15 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.
ఎస్ఆర్‌హెచ్ నాలుగో వికెట్
అనికేత్ వర్మ రూపంలో ఎస్ఆర్‌హెచ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన అనికేత్ శర్మ.. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 13 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ 4 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. క్రీజులో ఇషాన్ కిషన్(48), నితీష్ కుమార్‌రెడ్డి(3) ఉన్నారు.
క్లాసెన్ ఔట్..
హెన్రిచ్ క్లాసెన్ రూపంలో ఎస్ఆర్‌హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన క్లాసెన్.. సుయాష్ శర్మ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 8.5 ఓవర్లకు ఎస్ఆర్‌హెచ్ మూడు వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది.
7 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్ స్కోర్: 84/2
7 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్‌హెచ్ రెండు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. క్రీజులో క్లాసెన్(18), ఇషాన్ కిషన్(11) పరుగులతో ఉన్నారు.
ఎస్ఆర్‌హెచ్ రెండో వికెట్ డౌన్
ట్రావిస్ హెడ్ రూపంలో ఎస్ఆర్‌హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన హెడ్.. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
ఎస్‌ఆర్‌హెచ్ తొలి వికెట్ డౌన్..
అభిషేక్ శర్మ రూపంలో ఎస్‌ఆర్‌హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. 34 పరుగులు చేసిన అభిషేక్..ఎంగిడీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 4 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది.
దూకుడుగా ఆడుతున్న అభిషేక్, హెడ్..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఆర్‌హెచ్ దూకుడుగా ఆడుతోంది. 3 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ వికెట్ నష్టపోకుండా 39 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ(24), హెడ్(12) పరుగులతో ఉన్నారు.
ఐపీఎల్-2025లో భాగంగా ఎకానా స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పాటిదార్ గాయం కారణంగా దూరమయ్యాడు. అతడి స్ధానంలో జితేష్ శర్మ బెంగళూరు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
తుది జట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్, జితేష్ శర్మ(కెప్టెన్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, లుంగి ఎన్గిడి, సుయాష్ శర్మ
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ