
Photo Courtesy: BCCI/IPL
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 షెడ్యూల్‌లో బీసీసీఐ స్వల్ప మార్పులు చేసింది. ఈ ఏడాది సీజన్‌లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఆడాల్సిన ఆఖరి రెండు లీగ్ మ్యాచ్‌లను లక్నో మార్చారు. బెంగళూరులో భారీ వర్షాల కారణంగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
ఆర్సీబీ తమ తదుపరి రెండు మ్యాచ్‌ల్లో మే 23న సన్‌రైజర్స్ హైదరాబాద్, మే 27న లక్నో సూపర్ జెయింట్స్‌తో బెంగళూరు వేదికగా తలపడాల్సి ఉంది. ఇప్పుడు రీ షెడ్యూల్ చేయడంతో ఈ రెండు మ్యాచ్‌లనీ లక్నో లోని ఏక్నా క్రికెట్ స్టేడియంలో ఆర్సీబీ ఆడనుంది.
"ఐపీఎల్-2025లో ఆర్సీబీ, ఎస్ఆర్‌హెచ్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను లక్నోకు తరలించాము. బెంగళూరులో వర్షాల కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆర్సీబీ-లక్నో మ్యాచ్ కూడా అదే వేదికలో జరగనుంది" అని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా ఇప్పటికే బెంగళూరు వేదికగా ఆర్సీబీ-కేకేఆర్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వేదికను భారత క్రికెట్ బోర్డు మార్చింది.
మరోవైపు ప్లే ఆఫ్స్, ఫైనల్ వేదికలను కూడా బీసీసీఐ ఖరారు చేసింది. మే 29న జరిగే క్వాలిఫయర్ 1, మే 30న జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లకు ముల్లాన్‌పుర్ ఆతిథ్యమిస్తుంది. క్వాలిఫయర్ 2 (జూన్ 1), ఫైనల్ (జూన్ 3) అహ్మదాబాద్‌లో జరుగుతాయి.
చదవండి: ఆ యంగ్ క్రికెటర్‌కు నేను హాగ్ ఇవ్వలేదు: ప్రీతి జింటా